అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
తిరుమల లడ్డూ వివాదంపై విచారణకు సుప్రీంకోర్టు బెంచ్
Published on Sat, 09/28/2024 - 10:39
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదం కేసు విచారణకు బెంచ్ను సుప్రీంకోర్టు నిర్ణయించింది. లడ్డూ కేసు విచారణ జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్కు కేటాయించింది. కాజ్ లిస్టులో ఐటెం నెంబర్ 63గా తిరుమల లడ్డూ కేసు లిస్ట్ అయ్యింది. ఎల్లుండి, సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
ఈ వివాదం నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేయగా, ఈ రెండు పిటిషన్లను ఒకేసారి సుప్రీంకోర్టు విచారించనుంది.

ఇదీ చదవండి: చంద్రబాబు మరో అబద్ధం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్
Tags : 1