తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
వారికి రాజకీయంగా భోజనం లేదు: కొడాలి నాని
Published on Mon, 07/18/2022 - 19:35
సాక్షి, తాడేపల్లి: వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఏ సీఎం చేయని విధంగా పునరావాస చర్యలు చేపట్టామన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.2 వేలు, నిత్యావసరాలు అందించామన్నారు. ప్రభుత్వంపై విషం చిమ్మడమే ఎల్లోమీడియా పనిగా పెట్టుకుందన్నారు. చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.
చదవండి: ఆ రోజు పవన్ కల్యాణ్ నోరు ఎందుకు మెదపలేదు?
షూటింగ్ విరామాల్లో పవన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వీరికి కనిపించదని కొడాలి నాని నిప్పులు చెరిగారు. త్వరలో ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. వరద పరిస్థితులపై సీఎం రెగ్యులర్ మానిటరింగ్ చేశారు. పిల్లలకు పాలు, వరద బాధితులకు భోజనం ఏర్పాట్లు చేశాం. ‘‘పెద్దలకు భోజనం, పిల్లలకు పాలు లేవంటూ ఈనాడులో అబద్ధాలు రాశారు. పెద్దలయిన రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడికి రాజకీయంగా భోజనం లేదు.. రాజకీయంగా పిల్లలు అయిన లోకేష్, పవన్ కళ్యాణ్‌లకు పాలు లేవంటూ’’ కొడాలి నాని ఎద్దేవా చేశారు.
Tags : 1