రైల్వే ట్రాక్‌పై టీటీడీ మాజీ ఏవీఎస్‌వో మృతదేహం

Published on Fri, 11/14/2025 - 12:57

సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్‌వో సతీష్‌ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా పడి కనిపించారు. 

పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్‌పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును గతంలో విచారించిన సతీష్‌ను.. ఆపై నిందితుడిగా సిట్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఆర్‌ఐగా పని చేస్తున్న ఆయన్ని ఈ నెల 6వ తేదీన సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ బృందం విచారణ జరిపింది. అయితే.. 

మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీంతో వేధింపులు భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సతీష్‌ను వేధించారు: వైఎస్సార్‌సీపీ
సతీష్‌ కుమార్‌ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని అంటున్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌. ‘‘పరకామణి కేసులో రవికుమార్ ని పట్టుకున్నదే సతీష్ కుమార్. అలాంటి వ్యక్తి చనిపోవడం అనుమానాస్పదంగా ఉంది. సతీష్ మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపించాలి. వాస్తవాలు ఏంటో‌ బయటి ప్రపంచానికి తెలియచేయాలి. 

సతీష్‌ను వేధించారు. భూమన కరుణాకరరెడ్డిని ఆ కేసులో లాగాలని సతీష్ పై ఒత్తిడి చేశారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయాలలో కి లాగటం బాధాకరం. ఈ కేసులో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే సతీష్ ఆత్మహత్య చేసుకున్మాడో అర్థం చేసుకోవచ్చు. తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని సతీష్ కుమార్ తన ఫ్రెండ్స్ దగ్గర చాలా సార్లు చెప్పారు. నాలుగు రోజుల సతీష్ విచారణ లో ఏం జరిగిందో బయట పెట్టాలి. వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’’ అని శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)