Breaking News

చేతులెత్తేసిన ఎస్‌ఈసీ?

Published on Mon, 08/11/2025 - 05:56

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీడీపీ నేతల అరాచకంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చేతులెత్తేసిందా? అన్న ప్రశ్నకు అధికార వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానం వినిపిస్తోంది. ఓటింగ్‌ శాతాన్ని తగ్గించే కుట్రలో భాగంగా పులివెందుల మండలంలోని ఎర్రబెల్లి, నల్లగొండువారిపల్లి, నల్లపురెడ్డిపల్లిలో 6, 7, 8, 9, 10, 11 పోలింగ్‌ బూత్‌లను ఇష్టానుసారం మార్చేశారు. ఏ ఊరిలో వారు ఆ ఊళ్లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసేందుకు వీలు లేకుండా చేశారు. తద్వారా వైఎస్సార్‌సీపీకి గట్టి పట్టు ఉన్న ఈ ఊళ్లలో ఓటింగ్‌ శాతం తగ్గించేలా అధికార పార్టీకి నిబంధనలకు విరుద్ధంగా అధికారులు లబ్ధి చేకూర్చారు.

దీనిపై వైఎస్సార్‌సీపీ బృందం పలుమార్లు ఎస్‌ఈసీకి వినతి పత్రాలు అందజేసింది. పోలింగ్‌ కేంద్రాలు ఇదివరకటిలాగే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌ నుంచి సమగ్ర నివేదిక కోరారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ.. ఎర్రబెల్లి, నల్లగొండువారిపల్లి, నల్లపురెడ్డిపల్లిలో పోలింగ్‌ బూత్‌లు మార్చింది వాస్తవమేనని తెలిపారు. రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుం­దన్నారు. ఎక్కడివారు అక్కడే ఓటు వేసేలా పోలింగ్‌ బూత్‌లు ఉండాలని వైఎస్సా­ర్‌సీపీ అభ్యర్థి కోరుతుండగా, టీడీపీ అభ్యర్ధి మాత్రం తాజా మార్పు మేరకే పోలీంగ్‌ బూత్‌లు ఉండాలని వినతిపత్రం ఇచ్చారని నివేది­క­లో పేర్కొన్నారు.

ఇప్పటికే 70 శాతం ఓటర్‌ స్లిప్పులు కూడా పంపిణీ చేశామని తెలిపారు. దీంతో ప్రస్తుత పరిస్థితినే కొనసాగించేలా ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలి­సింది. ఇందులో భాగంగానే ఓటర్లకు దూరంగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేసిన గ్రామాలకు ప్రజా రవాణా సౌకర్యం కల్పించాలని కడప కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. హెల్ప్‌ డెస్క్‌ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ విషయం సోమవారం కోర్టులో విచారణకు వస్తే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితిలో బూత్‌లను మార్చలేమని చెప్పనున్నట్లు సమాచారం. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)