Breaking News

కరుడుగట్టిన పసుపు యోధుడు

Published on Sun, 06/23/2024 - 05:38

సాక్షి, అమరావతి: చింతకాయల అయ్యన్నపాత్రుడు కరుడు గట్టిన పసుపు యోధుడు, ఫైర్‌బ్రాండ్‌  అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఆయ­న నేతృత్వంలో రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా శాసనసభ హుందాగా నడుస్తుందని నమ్ముతున్నానన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రు­డును సీఎం అభినందించారు. 

ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్ని­కల్లో ప్రజలు తమకు ఘన విజయం అందించడంతో పాటు పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన శాసననభ సభ్యులను ఎగతాళి చేసి అవమానపరచకూడదని సభలోని సభ్యులకు సూచించారు. 

అయ్యన్నను స్పీకర్‌ పదవిలో చూడటం గర్వంగా ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని మాజీ సీఎం ఎన్టీఆర్‌ ఇచ్చిన పిలుపుతో వచ్చిన అయ్యన్న ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్రవేశారన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతను ఆయన పుణికిపుచ్చుకున్నారని ప్రశంసించారు.
  
సీఎంగానే సభలో అడుగుపెట్టా.. 
సీఎంగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని 2021 నవంబర్‌ 19న సభ నుంచి బయటకువెళ్లానని, ప్రజల ఆశీస్సులతో మళ్లీ సీఎంగానే సభలోకి అడుగుపెట్టానని చంద్రబాబు తెలిపారు. తనకు వచ్చిన అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ రాలేదన్నారు. 16వ సభను అత్యున్నత సభగా మనం నిర్వహించాలన్నారు. 

25 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయాల ప్రభావంతోనే నేడు హైదరాబాద్‌ ఉత్తమ నగరంగా నిలిచిందన్నారు. రాజధాని నిర్మాణం, పోల­వరం పూర్తిచేయడంతో పాటు, వికసిత్, పేదరి­కంలేని ఏపీని తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామన్నా­రు. ఇందులో భాగంగా 2047 నాటికి రాష్ట్రం అగ్ర­స్థానంలో నిలిచేలా చట్టసభ ముందుకు సాగాలన్నారు. 

ప్రజలు హుందాతనం చూస్తారు 
ఇన్ని రోజులు ప్రజలు అయ్యన్నలోని వాడివేడి చూశారని, ఇక మీదట హుందాతనం చూడబోతున్నారని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఇకపై తిట్టే అవకాశం ఆయనకులేదని, సభలో తిట్టే వారిని నిలువరించే బాధ్యత ఉందన్నారు. అయ్యన్నను స్పీకర్‌ చేయడం చూస్తుంటే అల్లరి పిల్లాడిని క్లాస్‌ లీడర్‌ను చేసినట్లుందన్నారు. 

గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టినప్పటికీ అయ్యన్నపాత్రుడు భయపడలేదని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ తెలిపారు. సు«దీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ప్రజలకు ఎన్నో సేవలు చేశారని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు.

హుందాగా మాట్లాడాలి.. 
శాసనసభలో సభ్యులు హుందాతనంగా మాట్లాడాలి. ప్రస్తుత సభలో 88 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా ఎన్నికయ్యారు. వీరందరికీ అవకాశాలిస్తాను. ప్రజలు, రాష్ట్రం కోసం అందరూ మాట్లాడాలి. కొత్తగా ఎన్నికైన వారందరికీ సభ సంప్రదాయాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రజలెంతో నమ్మకంతో బాధ్యత ఇచ్చారు. సభ్యులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. – చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనసభ స్పీకర్‌

హుందాగా నడపాలంటూనే జగన్‌పై అనవసర విమర్శలు.. 
గత శాసనసభను కౌరవ సభతో పోలుస్తూ.. ప్రస్తుత సభను హుందాగా నడపాలంటూ సీఎం చంద్రబాబు ప్రసంగం ముగిసిన వెంటనే  మంత్రులు అనిత, బీసీ జనార్థన్‌రెడ్డి, ఫరూక్, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర సహా ఇతర సభ్యుల ప్రసంగాలన్నీ మాజీ సీఎం జగన్‌ నామస్మరణతోనే కొనసాగాయి. పదేపదే ఆయన పేరును ప్రస్తావిస్తూ విమర్శించారు.

నీతి వాక్యాలు వల్లెవేసిన అధికార పక్ష నాయకులే సభా సంప్రదాయాలకు విరుద్ధంగా సభలోలేని ప్రతిపక్ష నేత పేరును పదేపదే ప్రస్తావిస్తూ అర్థరహిత విమర్శలు చేశారు. టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ స్పీకర్‌కు అభినందనలు చెప్పడం కంటే జగన్‌ను తూలనాడటంపైనే ఎక్కువగా దృష్టిసారించారు.

అంతకుముందు.. సభను దూషణలు, వెకిలి చేష్టలతో కాకుండా గౌరవంగా నిర్వహించాలని కోరిన చంద్రబాబే.. ప్రతిపక్ష పార్టీ సభ్యులు పిరికితనంతో సభకు రాలేదని వ్యాఖ్యానించడం విశేషం. పవన్‌ కళ్యాణ్‌ సైతం ప్రతిపక్ష సభ్యులకు సభకు వచ్చే ధైర్యంలేదని విమర్శించారు. విజయాన్ని తీసుకున్నారుగాని, ఓటమిని తీసుకోలేక పారిపోయారని ఎద్దేవా చేశారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)