చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
టీడీపీ హింసా కాండ.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడి
Published on Thu, 10/22/2026 - 07:48
సర్వోనత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు తీరు మారలేదు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీపై దాడులు ఆపాలంటూ గడ్డిపెట్టినా ఎల్లో గ్యాంగ్‌కు బుద్ధిరాలేదు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసిన నామినేషన్లను వెనక్కు తీసుకునేలా బెదిరింపులకు దిగడం వంటి అరాచకాలు ఇంకా కొనసాగిస్తూనే ఉంది పచ్చమంద. పోలీసులు, అధికారుల అండతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మూకలు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నాయి.
వైఎస్సార్ జిల్లాలో భారీ కుట్రకు తెరలేపిన టీడీపీ
- జడ్పీటీసీ, ఎంపీటీసీస్థానాలకు ఫేక్ నామినేషన్లు
- టీడీపీ నేతలే వైఎస్సార్సీపీ తరఫున నామినేషన్లు దాఖలు
- 2 రోజుల్లో వైఎస్సార్సీపీ రెండు జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే నామినేషన్
- అధికారుల జాబితాలో 13 నామినేషన్లు పడ్డట్లు వెల్లడి
- మండల స్థాయిలో ఎంపీటీసీ నామినేషన్లలోనూ ఇదే పరిస్థితి
- ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
- దౌర్జన్యాలు జరగడం లేదని కోర్టుల ముందు చూపే ప్రయత్నం
- వైఎస్సార్సీపీ అభ్యర్ధులు స్వేచ్ఛగా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారని మభ్యపెట్టే ప్రయత్నం
- నామినేషన్ వేసిన వ్యక్తుల పేర్లను పరిశీలిస్తే అంతా టీడీపీకి చెందిన వారిగా గుర్తింపు
ఏపీ హైకోర్టులో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ
- పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని పిటిషన్
- మురళీనాయక్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు
- దాడులు చేసిన అధికార పార్టీ నాయకులను వదిలేసి.. బాధితులపైన కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్
- వైఎస్ అవినాష్‌రెడ్డి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు
- పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఎస్ఈసీకి ఆదేశం
- తదుపరి విచారణ రేపటికి వాయిదా
శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రిలో పోలీసుల దాష్టీకం
- వైఎస్సార్సీపీ నేత తాడమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డ పోలీసులు
- 9 నెలల గర్భిణిపై మానవత్వం లేకుండా అనాగరిక ప్రవర్తన
- గూండాల్లా ఇంటిలోకి చొరబడి మహిళలపైనా దాడికి దిగిన పోలీసులు
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి
- అనంతపూర్, నాయక్‌నగర్‌లో టీడీపీ గూండాగిరి
- ప్రచారం చేస్తున్న కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడి
- ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
- టీడీపీ గూండాల దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలు
- హూటాహుటిన ఆస్పత్రికి తరలించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు
చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికలపై కలెక్టర్ కీలక ఆదేశాలు
- బలవంతపు ఉపసంహరణపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
- 36 డివిజన్లలో వైఎస్సార్సీపీ నామినేషన్లను తీసేసిన అధికారులు
- అభ్యర్థులు వెళ్లకుండానే నామినేషన్ల విత్ డ్రా
- ఆర్వోపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ ఫిర్యాదు
- మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పించాలని వినతి
- వైఎస్సార్సీపీ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ సుమిత్
తిరుపతి:
రైల్వేకోడూరులో పచ్చకిరాయి మూకల మోహరింపు
- ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద ఇతర ప్రాంతాల నుంచి గూండాలు
- ఒక్కో నామినేషన్ కేంద్రానికి 500 మందిని కేటాయించిన టీడీపీ
- వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్‌గా రెచ్చిపోతున్న కిరాయి మూకలు
- నామినేషన్‌కు వచ్చిన వారిపై దాడి చేసి పత్రాలు చించివేత
శ్రీసత్యసాయి:
బత్లలపల్లిలో టీడీపీ నేతల దాష్టీకం
- వైఎస్సార్సీపీ అభ్యర్థులపై రాళ్లతో దాడి చేసిన పచ్చమూక
- అడ్డుకున్న సీఐ ప్రభాకర్ రెడ్డిపైనా దాడి.. జీపు ధ్వంసం
- టీడీపీ గూండాల దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు
నెల్లూరు:
వెంకటగిరిలో పోలీసుల హైడ్రామా
- ఎంపీటీసీ నామినేషన్ల వేళ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హౌస్ అరెస్ట్
- 23 సాయంత్రం వరకూ ఇంట్లోని ఉండాలని నోటీసులు
- పోలీసులతో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వాగ్వాదం
వైఎస్సార్ జిల్లా
- జడ్పీ నామినేషన్ సెంటర్లో టీడీపీ అరాచకం
- హైడ్రామాకు తెరలేపిన పోలీసులు, అధికారులు
- నామినేషన్ సెంటర్లో టీడీపీ మూకల మకాం
- వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు లాక్కొనేందుకు యత్నం
- శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ గూండాల దౌర్జన్యం
- పుల్లారెడ్డి కండ్రిగ వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి
అన్నమయ్య:
- తంబళ్లపల్లెలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
- పెద్దమండెంలో వైఎస్సార్సీపీ నేతల బైక్‌లకు నిప్పు
- వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డ టీడీపీ గూండాలు
తిరుపతి:
- తొట్టెంబేడులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి
- వైఎస్సార్సీపీ అభ్యర్థి సురేష్‌రెడ్డి తలకు తీవ్రగాయం
బరితెగించిన టీడీపీ గూండాలు
- పల్నాడు జిల్లా మాచర్ల నామినేషన్ కేంద్రం వద్ద బరితెగించిన టీడీపీ గూండాలు.
- మాచర్ల మండలం చింతల్ తండా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రమావత్ గబ్బర్ సింగ్‌పై టీడీపీ రౌడీ గ్యాంగ్ దాడి
- రమావత్ గబ్బర్ సింగ్ చేతికి గాయం
- దాడిని అడ్డుకోవడానికి వెళ్లిన గబ్బర్ సింగ్ భార్యపై దుర్భాషలు
- వినుకొండ నియోజకవర్గంలో బరితెగించిన తెలుగుదేశం గుండాలు
- ఈపూరు మండలం ఎనిమెళ్ళలో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి అనిల్
- అనిల్‌పై విచక్షణ రహితంగా దాడి చేసిన టీడీపీ గూండాలు
- అనిల్‌కు తీవ్ర గాయాలు.. నరసరావుపేట హాస్పిటల్ కి తరలింపు
చిలకలూరిపేట:
మహిళలపై కూడా పచ్చ గూండాలు దాడులు చేస్తున్నారు: విడదల రజిని
- వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకుంటున్నారు
- టీడీపీ గూండాలు అరాచకం చేస్తుంటే ఎస్ఈసీ ఏం చేస్తోంది
- పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారు
- వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు
- టీడీడీ గూండాల అరాచకాలకు పోలీసులు సహకరిస్తున్నారు
బాపట్ల:
- రేపల్లె మండలం లంకమైనదిబ్బలో టీడీపీ అరాచకం
- వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి వీర రాఘవయ్యపై దాడి
- నామినేషన్ పత్రాలు లాక్కొని చింపేసిన టీడీపీ రౌడీలు
తిరుపతి
- సూళ్లూరుపేటలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రం వద్ద ఉద్రిక్తత
- రెండవరోజు వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ గూండాలు
- టీడీపీ గుండాలు ఆపివేయడంతో నామినేషన్లు వేయలేని వైఎస్సార్సీపీ అభ్యర్థులు
- టీడీపీ గూండాలు అరాచకం చేసిన ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు.
- మహిళలు అని చూడకుండా వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న టీడీపీ గుండాలు.
- టీడీపీ గుండాల అరాచకం నేపథ్యంలో మహిళల శఫథం
- ఎన్ని అడ్డంకులు సృష్టించినా రేపు వచ్చి నామినేషన్లు వేసి తీరుతామని శపథం
కృష్ణాజిల్లా
- ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైనక్కి తగ్గని వైఎస్సార్సీపీ అభ్యర్థులు
- అవనిగడ్డ వైయస్సార్ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు
- వేకనూరు సెగ్మెంట్ అభ్యర్థినిగా వర్రె శిరీష నామినేషన్ దాఖలు
- అవనిగడ్డ (2) సెగ్మెంట్ అభ్యర్థిగా కేసన హరి నామినేషన్ దాఖలు
- అవనిగడ్డ (3) సెగ్మెంట్ అభ్యర్థిగా అన్నపరెడ్డి పరమాత్మ నామినేషన్ దాఖలు
- అవనిగడ్డ (4) సెగ్మెంట్ అభ్యర్థినిగా P సరళ నామినేషన్ దాఖలు
- అవనిగడ్డ (5) సెగ్మెంట్ అభ్యర్థిగా చింతలపూడి బాలు నామినేషన్ దాఖలు
- అవనిగడ్డ (7) సెగ్మెంట్ అభ్యర్థినిగా గరికపాటి లక్ష్మీపార్వతి నామినేషన్ దాఖలు
- దక్షిణచిరువోలులంక సెగ్మెంట్ అభ్యర్థిగా తోట జగన్ నామినేషన్ దాఖలు
- పులిగడ్డ సెగ్మెంట్ అభ్యర్థినిగా మాతంగి ఝాన్సీ ప్రియ నామినేషన్ దాఖలు
- ఎడ్లలంక ఎంపీటీసీ అభ్యర్థిగా బందెల రాముడు నామినేషన్ దాఖలు
పల్నాడు జిల్లా:
- వినుకొండ నియోజకవర్గంలో బరితెగించిన టీడీపీ గుండాలు
- ఈపూరు మండలం ఎనిమెళ్ళలో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థి అనిల్
- అనిల్‌పై విచక్షణ రహితంగా దాడి చేసిన టీడీపీ గూండాలు
- అనిల్‌కు తీవ్ర గాయాలు
- నరసరావుపేట హాస్పిటల్‌కి తరలింపు
కర్నూలు జిల్లా
- క్రిష్ణగిరిలో తీవ్ర ఉద్రిక్తత
- వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్న టీడీపీ గుండాలు
- నామినేషన్ కేంద్రం వద్ద రాళ్ల దాడికి తెగబడ్డ టీడీపీ వర్గీయులు
- ఇరువర్గాలు రాళ్లదాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత
- టీడీపీ నామినేషన్ల అనంతరం వైఎస్సార్సీపీ నామినేషన్లు వేయిస్తామని మొదట్లో అడ్డుకున్న పోలీసులు
- పోలీసుల సూచనలు పాటించకుండా నామినేషన్ వేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ వర్గీలపై టీడీపీ దాడి
తిరుపతి జిల్లా
- శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు
- తొట్టంబేడు లో కాసరం ఎంపీటీసీ
- వైఎస్సార్సీపీ అభ్యర్థి సురేష్ రెడ్డిపై దాడి
- తలకు తీవ్ర గాయాలు, రక్తమోడుతున్న కనికరించనీ పచ్చ గుండాలు
అనంతపురం:
- రాప్తాడులో ఉద్రిక్తత
- నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థులపై రాళ్లు రువ్విన టీడీపీ నేతలు
- పోలీసుల ప్రేక్షక పాత్ర
- ఉదయం నుంచి తిష్ట వేసిన టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు
- రాప్తాడు నామినేషన్ కేంద్రం నుంచి టీడీపీ నేతలను పంపని పోలీసులు
- అనంతపురం జెడ్పీ మాజీ చైర్మన్ బోయ గిరిజమ్మ వెంట వచ్చిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు
- పోలీసుల సమక్షంలోనే రాళ్లు రువ్విన టీడీపీ నేతలు
వైఎస్సార్ జిల్లా:
- ఎర్రగుంట్ల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ నుంచి మరో నామినేషన్ దాఖలు
- తీవ్ర నిర్బంధం మధ్య హైమావతి నామినేషన్ దాఖలు
కృష్ణా:
గుడివాడలో టీడీపీకి షాక్
- వైఎస్సార్సీపీలో చేరిన కుదరవల్లి టీడీపీ కార్యకర్తలు
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కొడాలి నాని
- టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
- వెన్నుపోటు పొడిచిన టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారు
- త్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుంది
తిరుపతి:
పాకాలలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
- నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థిపై దాడి
- పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలు చింపేసిన పచ్చమూక
తిరుపతి:
చంద్రగిరిలో కొనసాగుతున్న టీడీపీ దౌర్జన్యాలు
- మంగళం వైఎస్సార్సీపీ ఎంపీపీ అభ్యర్థి సుధాయాదవ్పై దాడి
- ఎంపీడీఓ కార్యాలయంలో పోలీసుల ముందే పచ్చమూకల దాడి
- పచ్చమూకల దాడిలో సుధాయాదవ్కు గాయాలు
వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ గూండాల అరాచకం
- మూడోసారి వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల చింపివేత
- కలెక్టర్ హామీతో నామినేషన్ సెంటర్‌కు వైఎస్సార్సీపీ అభ్యర్థులు
- ఆర్ఓ వద్దకు పూర్తి భద్రతతో తీసుకెళ్తామని కలెక్టర్ హామీ
- కలెక్టర్ హామీతో మరోసారి నామినషన్ సెంటర్‌కు వెళ్లిన అభ్యర్థులు
- నామినేషన్ సెంటర్ గేటు వద్దే అడ్డుకున్న టీడీపీ గూండాలు
- నామినేషన్ లాక్కొని చింపేసిన పుత్తా నరసింహారెడ్డి
- టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు
వైఎస్సార్ జిల్లా
- వైఎస్సార్ జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
- గర్భిణి అని సైతం చూడకుండా టీడీపీ గూండాల దౌర్జన్యం
- ఎంపీటీసీ నామినేషన్ వేయడానికి వచ్చిన గర్భిణి అడ్డగింత
- నామినేషన్ పత్రాలు లాక్కొని చించేసిన టీడీపీ గూండాలు
అనంతపురం:
- అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజాస్వామ్యం అపహాస్యం
- కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అనంతపురం రూరల్ మండల ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ
- నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల దాడులు
- నామినేషన్లు వేస్తే చంపుతామని బెదిరింపులు
- పోలీసుల ప్రేక్షక పాత్ర
పల్నాడు జిల్లా:
- రెంటచింతలలో ఆగని టీడీపీ గూండాల రౌడీయిజం
- నామినేషన్ వేయడానికి వెళ్లన ఏశబోయిన నారాయణ, చల్లా సుబ్బారావుపై దాడి
- ఎమ్మెల్యే జేబీఆర్ పేరుతో రెండు కార్లలో వచ్చి దాడి చేసి నామినేషన్ పత్రాలను చించివేసి పచ్చ గూండాలు
- నామినేషన్ వేస్తే చంపుతామని బెదిరించారు: వైఎస్సార్ సీపీ అభ్యర్థి నారాయణ
- తమపై దాడి చేసిన పచ్చ రౌడీలు నరేంద్ర, గాలి వంశీ, అడుసుమల్లి అనిల్, కొబ్బరిబోండాల శ్రీనులపై చర్య తీసుకోవాలని డిమాండ్
మార్కాపురం జిల్లా:
- కొనకనమిట్ల ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత
- నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు
- వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేస్తున్న పోలీసులు
- నామినేషన్ కేంద్రం వద్ద భారీగా మోహరించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల దాడులు
- పరిస్థితి పోలీసులు టీడీపీకి అనుకూలంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు రోడ్డుపై కూర్చొని నిరసన
వైఎస్సార్ కడప జిల్లా నందలూరు:
- వైఎస్సార్ కడప జిల్లా నందలూరులో టీడీపీ నేతల సుబ్రహ్మణ్యం కాల్పులు
- ఎంపీపీ సీటు కోసం టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ
- రోడ్డెక్కి తన్నుకున్న టీడీపీ నేతలు, వాహనాలకు నిప్పు
- రాళ్లు విసురుకున్న టీడీపీలోని రెండు వర్గాలు
- ఐదు రౌండ్లు కాల్పులు జరిపిన టీడీపీ నేత సుబ్రహ్మణ్యం
రెచ్చిపోయిన చింతమనేని అనుచరులు
- ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలంలో రెచ్చిపోయిన పచ్చమూకలు
- కోమటి లంక ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి రత్నం నామినేషన్ పత్రాలు చించేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు
- ఏలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన రత్నంపై దౌర్జన్యం
ఎస్ఐ లోకేష్‌పై దాడులకు తెగబడ్డ టీడీపీ మూకలు
- చంద్రగిరి మండలం ఎర్రవారిపాలెంలో ఎస్ఐపై దాడి
- వైఎస్సార్సీపీ అభ్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం ఇవ్వాలన్న ఎస్ఐ
అపాయింట్మెంట్ ఇచ్చిన ఎస్ఈసీ
- వైఎస్సార్సీపీ నిరసనతో దిగొచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
- వైఎస్సార్సీపీ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
MPTC నామినేషన్ వేయడానికి వచ్చిన YSRCP మహిళా అభ్యర్థి చేతుల్లోంచి నామినేషన్ పత్రాలు లాక్కొని పరారైన TDP మూకలు! https://t.co/Qx2eoqRmZo
— 𝐌𝐚𝐧𝐨𝐣_𝐘𝐒𝐉 (@2029YSJ) October 22, 2026
పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ దాడులు
- అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యం
- చౌడేపల్లి మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణ రెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి
- ఇళ్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం
- చౌడేపల్లి మండలం యనమసామనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాసుల రెడ్డిపైనా దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థి అడ్డగింత
- మార్కాపురం జిల్లా పుల్లలచెరువులో నామినేషన్ కేంద్రం వద్ద మల్లా పాలెం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆవుల అంజలి అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు.
- అంజలి భర్త నర్సిరెడ్డి మాజీ సర్పంచ్ ఆవుల రమణారెడ్డితో వాగ్వాదానికి దిగిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు
- నామినేషన్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుగా నిలబడిన పచ్చ మూకలు
- చోద్యం చూసిన పోలీసులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే ఎదురుదాడి
చిత్తూరు
- చిత్తూరు జెడ్పీ ఆఫీసులో టీడీపీ గుండాల అరాచకం
- నామినేషన్ కేంద్రంలోనే టీడీపీ రౌడీల దాడి
- వైఎస్సార్సీపీ మహిళా అభ్యర్థులపై దాడి చేసిన టీడీపీ రౌడీలు
- జీడి నెల్లూరు జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ చించివేత
- ఆఫీస్ వద్ద అధికారులు, పోలీసులు ముందే చించివేత
- పోలీసులు సమక్షంలోనే జరిగినా పట్టించుకోని అధికారులు.
This is Ridiculous 💔💔💦💦 @JaiTDP మహిళ పై దాడి చేసిన TDP గుండాలు అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఆడవాళ్ళ మీద ఇలా నడి రోడ్డు మీద.. పోలీసులు పక్కన ఉండగానే ⚠️ #LocalBodyElections2026 #AndhraPradesh https://t.co/FcQjgmpCH7
— 𝐌𝐚𝐧𝐨𝐣_𝐘𝐒𝐉 (@2029YSJ) October 22, 2026
విజయవాడ..
- ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్
- వైఎస్సార్సీపీ నేతలు నామినేషన్లు వేసే పరిస్థితి లేదు
- టీడీపీ గూండాలు ఎగబడి తెగబడి దాడులు చేస్తున్నారు
- సుప్రీంకోర్టు ఆదేశాలున్నా వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై దాడులు ఆగడం లేదు
- మహిళలు అని కూడా చూడకుండా చీరలు లాగుతున్నారు
- జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియలోనూ మాపై దాడులు కొనసాగుతున్నాయి
- స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలని మాత్రమే మేం కోరుతున్నాం
- ప్రతీ రోజూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం మెట్లు ఎక్కుతున్నాం దిగుతున్నాం
- మాకు న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం ఆగదు
- ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి
విజయవాడ
- రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసు ఎదుట వైఎస్సార్సీపీ నేతల ధర్నా.
- ఎస్ఈసీ ఎదుట బైఠాయించిన వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్సీలు.
- డౌన్ డౌన్ ఎస్ఈసీ అంటూ నిరసన
- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
- వైఎస్సార్సీపీ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఫిర్యాదులు తీసుకోకుండా కావాలని తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం.
- సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరుతున్న వైఎస్సార్సీపీ నేతలు
- ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు అపాంట్మెంట్ ఇవ్వనంటున్న ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా.
శ్రీ సత్యసాయి జిల్లా..
- రాప్తాడు నియోజకవర్గంలో పోలీసుల ప్రేక్షక పాత్ర
- చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి, ఆత్మకూరు మండలాల్లో నామినేషన్ కేంద్రాలను చుట్టుముట్టిన పరిటాల సునీత వర్గీయులు
- నామినేషన్ వేసేందుకు వస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు
- నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు ఆయుధాలతో సంచరిస్తున్నా పట్టించుకోని పోలీసులు
- రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
కర్నూలు జిల్లా..
- కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం
- చిప్పగిరిలో ఎమ్మెల్యే వీరుపాక్షిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.
- నామినేషన్లను అడ్డుకోవడంలో బాగంగా రెండో రోజు కూడా కొనసాగుతున్న హౌస్ అరెస్టు.
- నామినేషన్ కేంద్రాల వద్ద ఎమ్మెల్యే లేకపోవడంతో నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు.
చంద్రగిరిలో కూటమి అరాచకాలు
- చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి అరాచకాలు
- నామినేషన్ సెంటర్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు
- మద్యం మత్తులో మహిళా అభ్యర్థులపైనా దాడులు
- ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలోనే దాడులు జరిగినట్టు ఆరోపణలు.
- ఎస్పీపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్
ఏలూరు:
- దెందులూరులో టీడీపీ గూండాల దాడులు
- వైఎస్సార్సీపీ నేతల నామినేషన్లను అడ్డుకున్న టీడీపీ రౌడీలు
- వైఎస్సార్సీపీ నేతలను నిర్బంధించిన టీడీపీ మూకలు
- టీడీపీ మూకలు దాడులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు
- సాక్షి టీవీ స్థానిక ప్రతినిధి ప్రసాద్‌పై చింతమనేని దాడి
- ప్రసాద్ చొక్కా చించి ఫోన్ లాక్కున్న చింతమనేని
వైఎస్సార్ జిల్లా..
- వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్న పోలీసులు
- పులివెందుల నియోజకవర్గం వేల్పుల వైఎస్సార్సీపీ ఎంపీటీసీ మహిళా అభ్యర్థిని అడ్డుకుంటున్న పోలీసులు
- వేములలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
- వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని, ప్రపోజల్స్‌ని మాత్రమే నామినేషన్ వేయడానికి అనుమతించాలని వేడుకుంటున్న నేతలు
- కడప పులివెందుల రోడ్డుపై కూర్చుని శాంతియుత నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలు
- వందల సంఖ్యలో టీడీపీ నేతలను అనుమతిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలను నామినేషన్ వేసే వారిని అడ్డుకుంటున్న పోలీసులు.
- ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే నినాదాలు చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు
- పోలీస్ అధికారులు దగ్గరుండి మాకు రక్షణగా తీసుకెళ్లి నామినేషన్లు వేయించాలని డిమాండ్
మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్
- నామినేషన్లు వేయడానికి వస్తే దాడులు చేస్తున్నారు.
- తలలు పగులగొడుతున్నారు.
- అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తే ఇరుక్కుపోతారు.
- ఏ గొడవ జరిగినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సెల్ ఫోన్లో రికార్డు చేయండి.
- నూటికి నూరు శాతం వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు.
- చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ బ్యాక్ గ్రౌండ్లో గొడవలు చేస్తున్నారు.
- అధికారులు రిటైర్డ్ అయినా న్యాయస్థానాల ముందు నిలబెడతాం.
- ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునేలా రక్షణ కల్పించాలి.
- మా పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోరాడుతారు.
- గురజాలలో యరపతినేని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు.
- పల్నాడు, రాయలసీమలో అరాచకం సృష్టిస్తున్నారు.
- నా ఇంటి మీద దాడిచేసిన గూండాలను చంద్రబాబు ప్రశంసించాడట.
- సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకూ ఎస్ఈసీ సైలెంట్ా ఉంటే అర్థమేంటి?
శ్రీ సత్యసాయి జిల్లా..
- రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో ఉద్రిక్తత
- వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి వెంకటలక్ష్మి-వెంకట్రామిరెడ్డి దంపతులపై దాడి
- ఓబుళంపల్లి నుంచి చెన్నేకొత్తపల్లి వెళ్తుండగా అడ్డుకున్న పరిటాల వర్గీయులు
- నామినేషన్ వేస్తే చంపుతామని బెదిరింపులు
- దౌర్జన్యం చేసిన టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు
కడప..
- పులివెందుల పార్టీ కార్యాలయానికి వైఎస్ అవినాష్ రెడ్డి
- కడపలో వైఎస్సార్సీపీ నాయకుల అరెస్టులు.
- వైఎస్సార్సీపీ నేతల కామెంట్స్..
- అరాచక పాలనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
- అధికారం శాశ్వతం కాదు..
- ప్రజాస్వామ్యమే శాశ్వతం.. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు
- కడప ఉన్న నాయకులను వేలాది మంది పోలీసులు వచ్చి బలవంతంగా అరెస్టు చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
- ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత పాలకులపై, పోలీసు యంత్రాంగంపై ఉంది.
- అరెస్టులకు దారితీసిన పరిస్థితులపై స్పష్టత ఇవ్వాలి.
- ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, ప్రతిపక్ష నాయకులను అరెస్టులతో అణచివేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
- ప్రజల హక్కులను హరించే వారికి సరైన సమయంలో ప్రజలే తమ తీర్పుతో సమాధానం చెబుతారు.
తిరుపతి..
- ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు సందర్భంగా కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు
- తిరుపతి ఎంపీ గురుమూర్తి హౌస్ అరెస్టు
- బ్యాంకు ఎంప్లాయిస్ కాలనీలో ఎంపీ నివాసం వద్ద పోలీసులు మోహరింపు
అభ్యర్థుల బలవంతపు అరెస్టులు..
- కడపలో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్న పోలీసులు
- కడపలో బలవంతంగా జడ్పీటీసీ అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
- కడప నుంచి అరెస్టు చేసి తిరుపతి వైపు తీసుకువెళుతున్న పోలీసులు..
- ఎందుకు అరెస్టు చేస్తున్నారు చెప్పాలని వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థుల ప్రశ్న.
- మమ్మల్ని తిరుపతి జిల్లాలో నామినేషన్ వేయించడానికి తీసుకెళ్తున్నారా అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్న అభ్యర్థులు.
- ఎందుకు అరెస్టు చేశారో చెప్పని పోలీసులు..
కర్నూలు ...
- పత్తికొండ మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్భందం
- నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు వెళ్తున్న శ్రీదేవిని అడ్డుకున్న పోలీసులు
- నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేయాలని పోలీసుల ప్రయత్నం
- పోలీసులతో వాగ్వాదానికి దిగిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే
- రోడ్డుపై బైఠాయించి పోలీసులపై ఆందోళన చేసిన శ్రీదేవి
- వైఎస్సార్సీపీ నామినేషన్లను టీడీపీ నేతలు అడ్డుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన శ్రీదేవి
- నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగపోతే న్యాయస్థానం ఆశ్రయిస్తాం.
- న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించిన శ్రీదేవి.
కాకినాడ జిల్లా
- తునిలో దాడిశెట్టి రాజాను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- తొండంగిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమైన రాజా
- నిన్న తొండంగి ఎంపీడీవో కార్యాలయం వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్న టీడీపీ మూకలు
- వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు విసిరిన టీడీపీ మూకలు, పలువురికి గాయాలు.
- నేడు మరోసారి ఎంపీటీసీ అభ్యర్ధులతో నామినేషన్లు వేయించేందుకు సిద్దమైన రాజా.
అనంతలో ఉద్రిక్తత..
- అనంతపురం జిల్లా తిమ్మంపల్లిలో ఉద్రిక్తత
- నామినేషన్లు వేయించేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
- పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదం
- పెద్దారెడ్డిని ఇంట్లో ఉంచి తాళాలు వేసిన పోలీసులు
అవినాష్ రెడ్డి అరెస్ట్..
- కడప వైఎస్సార్సీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..
- ఎంపీ అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి అరెస్ట్.
- వైఎస్సార్సీపీ ఆఫీసు నుంచి బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు.
- వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాగిపడేసిన పోలీసులు.
నెల్లూరు:
- మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్
- నిన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకున్న టీడీపీ
- సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు.
- నేడు వైఎస్సార్సీపీ జడ్పీటీపీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లో పాల్గొనడానికి సిద్ధమైన కాకాణి
- కాకాణి నామినేషన్లలో పాల్గొనడానికి వీలులేదని నోటీసు జారీ
సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్క చేయని టీడీపీ నేతలు, ఖాకీలు
- వారం రోజులుగా నెత్తురోడుతున్న ఏపీ
- టీడీపీ గూండాల అరాచకాలతో యథేచ్ఛగా హింసా కాండ
- జడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్లలోనూ దాడులు
- వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవటమే లక్ష్యం
- ఇష్టానుసారం దాడులు, నామినేషన్ పత్రాల చించివేత
- సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్క చేయని టీడీపీ నేతలు, ఖాకీలు
- పచ్చ గూండాలకు సహకరిస్తూ వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్న ఖాకీలు
- నామినేషన్లు వేయొద్దంటూ డైరెక్టుగా బెదిరిస్తున్న టీడీపీ నేతలు, ఖాకీలు
- డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించినా ఖాకీల్లో కనపడని మార్పు
కర్నూలు..
- పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి నివాసం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు
- నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు
- వెల్దుర్ది మండలంలో నామినేషన్ల ప్రక్రియలో శ్రీదేవి పాల్గొనకుండా హౌస్ అరెస్టు చేసి నిర్బంధించాలని చూస్తున్న పోలీసులు.
తిరుపతి..
- చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా చేరుకున్న పోలీసులు,
- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హౌస్ అరెస్ట్
- భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి బయటకి రావద్దంటూ నోటీసులు జారీ
- చంద్రగిరిలో టెన్షన్ వాతావరణం
చిత్తూరు జిల్లా..
- కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ నేతలు దౌర్జన్యం,
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్రమ అరెస్టు
- శాంతిపురం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుల్లెట్ దండపాణి అరెస్ట్
- బుల్లెట్ దండపాణిని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- దండపాణిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదంటున్న కుటుంబ సభ్యులు..
- ఆచూకీ తెలియక ఆందోళనలో కుటుంబ సభ్యులు.
- దండపాణి ఎక్కడ ఉన్నారో తెలియజేయాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి.
బాపట్ల జిల్లా..
- రేపల్లె నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత..
- ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల నేపథ్యంలో నిజాంపట్నంలో టీడీపీ నాయకుల అరాచకం..
- నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థుల పత్రాలను చించివేసిన వైనం..
- వైఎస్సార్సీపీ అభ్యర్థికి చెందిన కారును ధ్వంసం చేసి దాడులు.
- కొత్తపల్లిగడ్డ మాజీ సర్పంచ్ కొక్కిలిగడ్డ రవి, దిండి మాజీ సర్పంచ్ యమినేని రాంబాబు, వీరబాబుకు తీవ్ర గాయాలు..
- గాయపడిన నాయకులను మెరుగైన చికిత్స కోసం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
- కూటమి నాయకులు బహిరంగంగా దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
- ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి నాయకులు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం.
- ప్రతి సెగ్మెంట్ నుండి అభ్యర్థులతో నామినేషన్లు వేయిస్తామని, దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్..
- రేపల్లె రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు..
- మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రోద్బలంతోనే దాడులు..
- మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సోదరుడు మోపిదేవి హరనాథబాబు, అతని అనుచరులు.. మంత్రి ప్రోద్బలంతోనే ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపణ..
కర్నూలు జిల్లా..
- వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు
- కర్నూలు జిల్లా వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయం ఎదుట పేర్చిన రాళ్ల కుప్ప
- నామినేషన్ వేసేందుకు వచ్చే వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి రాళ్లను, కర్రలను సిద్దం చేసుకున్న పచ్చ మూకలు
- నామినేషన్లు వేయడానికి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు
- హింసకు ప్రేరేపించే విధంగా టీడీపీ నేతలు కుట్రలు.
అనంతపురం:
తాడిపత్రి మాజీ కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
శింగనమల నియోజకవర్గం యల్లనూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
ఈరోజు దగ్గరుండి వైఎస్సార్సీపీ నేతలతో నామినేషన్లు వేయించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి
యల్లనూరు నామినేషన్ కేంద్రం వద్ద రౌడీయిజం చేస్తున్న జేసీని వదిలేసి తనను గృహ నిర్బంధం చేయడంపై పెద్దారెడ్డి ఫైర్
వైఎస్సార్ జిల్లా..
పోరుమామిల్ల మండలంలో రెండో రోజు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం
ఇంటి చుట్టూ ముళ్ళ కంచె, భారీగా మోహరించిన పోలీసులు
బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
అడ్డుకుంటున్న పోలీసులు
అనంతపురం:
- మాజీ మంత్రి శైలజానాథ్ హౌస్ అరెస్ట్
- శింగనమల నియోజకవర్గం యల్లనూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న జేసీ వర్గీయులు
- వైఎస్సార్సీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు బయలుదేరిన శైలజానాథ్‌ను గృహ నిర్బంధం చేసిన పోలీసులు
ఇదీ చదవండి: టీడీపీకి భారీ షాక్.. కన్నీరు పెడుతూ కీలక నేత రాజీనామా
Tags : 1