Breaking News

సోదరుడు విజయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు: వైఎస్‌ జగన్‌

Published on Mon, 06/22/2026 - 08:31

టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌ను సోదరుడిగా సంభోదిస్తూ.. మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలతో పాటు చేపట్టే ప్రతి కార్యంలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్‌ జగన్‌ ఓ ట్వీట్‌ చేశారు. "సోదరుడు, తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి విజయ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ అన్ని ప్రయత్నాల్లో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని జగన్‌ పేర్కొన్నారు. రాజకీయ, ప్రజాసేవా రంగాల్లో విజయ్‌ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించిన వైఎస్‌ జగన్‌, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌ జగన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే విజయ్‌కు అగ్రనటుడిగా, ప్రస్తుతం రాజకీయ నేతగా కూడా విశేష ఆదరణ ఉంది. వీళ్లిద్దరూ ఆ మధ్య ఓ వివాహ వేడుకలో కలిసి సందడి చేశారు. అలాగే.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలోనూ విజయ్‌ వైఎస్‌ జగన్‌ ఫొటోను ప్రదర్శించడమూ విపరీతంగా చర్చనీయాంశమైంది. 

ఈ నేపథ్యంలో జగన్‌ చేసిన బర్త్‌డే ట్వీట్‌కు అటు విజయ్‌ అభిమానులు, ఇటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందిస్తూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఇద్దరు నేతల అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులను షేర్‌ చేస్తూ ఈ సందేశాన్ని వైరల్‌ చేస్తున్నారు.

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)