Breaking News

వెయ్యి కోట్ల క్లబ్‌లో రామాయణ.. పుష్ప-2 రికార్డ్ జస్ట్ మిస్

Published on Fri, 11/13/2026 - 12:36

రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా వచ్చిన రామాయణ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం రిలీజైన ఎనిమిది రోజుల్లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.  ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్క్ దాటేసింది. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన 11వ చిత్రంగా రామాయణ నిలిచింది. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడవ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇదేక్రమంలో పఠాన్, యానిమల్ సినిమాల జీవితకాల బాక్సాఫీస్ వసూళ్లను అధిగమించింది.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చూస్తే రూ. 675.05 కోట్ల గ్రాస్ రాబట్టగా.. రూ. 564.60 కోట్ల నికర వసూళ్లను దాటింది.  ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం 8వ రోజు అన్ని భాషల్లో కలిపి రూ. 53.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఓవర్‌సీస్‌లో రూ. 358.50 కోట్లు రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ. 1,033.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

కేవలం ఎనిమిది రోజుల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడో భారతీయ చిత్రంగా రామాయణ నిలిచింది. దీనికంటే ముందు 'పుష్ప 2: ది రూల్', 'ధురందర్: ది రివెంజ్' (ఏడు రోజులు) మాత్రమే ముందున్నాయి. ఇదే క్రమంలో 'బాహుబలి 2: ది కంక్లూజన్' (10 రోజులు), 'ఆర్ఆర్ఆర్' (16 రోజులు), 'జవాన్' (18 రోజులు) లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల రికార్డులను అధిగమించింది.

కాగా.. ఈ చిత్రంలో యశ్ రావణుడిగా కనిపించారు. ప్రముఖ నటుడు రవీ దూబే లక్ష్మణుడిగా అలరించారు. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో మెప్పించగా.. మండోదరిగా కాజల్ అగర్వాల్ ఆకట్టుకుంది. ఈ సినిమా నవంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మించారు. వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్న ఈ మూవీ సీక్వెల్‌లో కూడా సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. 
 

 

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు