Breaking News

ఒకటి కాదు..రెండు, మూడు సార్లు విడాకులు తీసుకున్న స్టార్స్‌ వీళ్లే

Published on Tue, 11/10/2026 - 13:19

చిత్ర పరిశ్రమలో ప్రేమ, పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారిలో కొన్ని జంటలు మాత్రమే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నాయి. చాలా మంది వివాహ బంధంలోకి అడుగు పెట్టిన కొన్నేళ్లకే  విడిపోతున్నారు. ఆ తర్వాత మరోకరి పెళ్లి చేసుకొని,  కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే కొందరి విషయంలో ఒకటి కాదు.. రెండు, మూడు వివాహాలు కూడా విడాకులతో ముగిశాయి. అయినప్పటికీ వారు జీవితంలో మరోసారి ప్రేమకు అవకాశం ఇచ్చారు. అలా రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు విడాకులు తీసుకున్న సినీ ప్రముఖులు ఎవరో చూద్దాం.

పవన్‌ కల్యాణ్‌..వరుసగా మూడు విడాకులు
1997లో నందినిని వివాహం చేసుకున్న పవన్ కల్యాణ్ 2008లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి రేణుదేశాయ్ లో సహజీవనం చేసి 2009లో పెళ్లిచేసుకున్నారు.ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2012లో వీరిద్దరూ విడిపోయారు. అనంతరం రష్యాకు చెందిన అన్నా లెజ్‌నేవాని 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు..తాజాగా పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు ప్రకటించారు.

ఆమిర్ ఖాన్‌.. రెండు విడాకులు
బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ వ్యక్తిగత జీవితంలో మూడు వివాహాలు చేసుకున్నారు. 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న ఆయన.. 2002లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్‌ రావును వివాహం చేసుకున్నారు. ఈ బంధం కూడా 2021లో విడాకులతో ముగిసింది. అనంతరం గౌరీ స్ప్రాట్‌ను 2026లో వివాహం చేసుకున్నారు. దీంతో ఆమిర్‌ జీవితంలో ఇప్పటివరకు రెండు వివాహాలు విడాకులతో ముగిశాయి.

ఇదీ చదవండి: రాజమౌళి వారణాసి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ డీల్..!

కమల్‌ హాసన్‌..మూడోసారి కూడా.. 
1978 లో నర్తకి వాణి గణపతిని కమల్‌ హాసన్‌  వివాహం చేసుకున్నారు. పదేళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు.. ఆ తర్వాత నటి సారిక ను పెళ్లి చేసుకొని,  2002లో ఆమెకు విడాకులు ఇచ్చారు. అనంతరం రముఖ నటి గౌతమితో సుమారు 13 ఏళ్ల పాటు హజీవనం చేశారు. గౌతమి కూతురు సుబ్బులక్ష్మిని కూడా కమల్ తన సొంత బిడ్డలా చూసుకున్నారు. అయితే 2016లో వ్యక్తిగత కారణాల వల్ల గౌతమి ఈ బంధం నుండి బయటికి వస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కమల్ హాసన్ ఒంటరిగానే ఉంటున్నారు.

రాధిక.. రెండు విడాకులు..మూడోసారి ప్రేమ పెళ్లి
ప్రముఖ సినీనటి రాధిక 1985లో ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోతనకు విడాకులిచ్చారు రాధిక. రెండో సారి లండన్‌కు చెందిన రిచర్డ్ హ్యార్లీని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు (రయాన్నే హార్డీ) జన్మించారు. ఆ తర్వాత వీరు కూడా విడాకులు తీసుకున్నారు. 2001లో హీరో శరత్ కుమార్‌తో ప్రేమలో పడి మరో పెళ్లి చేసుకున్నారు.


అనురాగ్‌ కశ్యప్‌.. రెండు పెళ్లిళ్లు.. రెండు విడాకులు
బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కూడా రెండుసార్లు వివాహం చేసుకుని.. రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. మొదట ఆర్తి బజాజ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ విడిపోయిన తర్వాత నటి కల్కి కొచ్లిన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ బంధం కూడా విడాకులతో ముగిసింది. అనురాగ్‌ తర్వాత మూడో వివాహం చేసుకోలేదు.

కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌.. వరుసగా రెండు విడాకులు
టెలివిజన్‌ నుంచి బాలీవుడ్‌కు వచ్చిన కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ మూడు వివాహాలు చేసుకున్నారు. 2008లో శ్రద్ధా నిగమ్‌ను వివాహం చేసుకోగా.. ఆ బంధం ఏడాదిలోపే ముగిసింది. 2012లో నటి జెన్నిఫర్‌ వింగెట్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2014లో ఇద్దరూ విడిపోయారు. అనంతరం 2016లో నటి బిపాషా బసును పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్నారు. కరణ్‌ జీవితంలో రెండు వివాహాలు విడాకులతో ముగిశాయి.

సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌.. మూడో వివాహంతో సక్సెస్‌
నిర్మాత సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ మూడు వివాహాలు చేసుకున్నారు. ఆయన మొదటి రెండు వివాహాలు విడాకులతో ముగిశాయి. ఆ తర్వాత 2012లో నటి విద్యాబాలన్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట బాలీవుడ్‌లో స్థిరమైన దాంపత్యానికి ఉదాహరణగా నిలుస్తోంది.

విధు వినోద్‌ చోప్రా.. రెండు విడాకుల తర్వాత మూడో వివాహం
ప్రముఖ దర్శక-నిర్మాత విధు వినోద్‌ చోప్రా కూడా మూడు వివాహాలు చేసుకున్నారు. ఆయన తొలి భార్య రేణు సలూజా. ఆ వివాహం విడాకులతో ముగిసింది. ఆ తర్వాత శబ్నమ్‌ సుఖ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ బంధం కూడా విడాకులకు దారితీసింది. అనంతరం అనుపమా చోప్రాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్నారు.

కిషోర్‌ కుమార్‌.. నాలుగు పెళ్లిళ్లు.. మూడు విడాకులు
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో దిగ్గజంగా నిలిచిన కిషోర్‌ కుమార్‌ ఏకంగా నాలుగు వివాహాలు చేసుకున్నారు. రూమా గుహ ఠాకుర్తా, మధుబాల, యోగితా బాలితో జరిగిన వివాహాలు విడాకులతో ముగిశాయి. నాలుగో భార్య లీనా చందావర్కర్‌తో మాత్రం ఆయన చివరి వరకు కలిసి ఉన్నారు. అందుకే కిషోర్‌ కుమార్‌ పేరు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు, విడాకుల విషయానికి వస్తే ప్రముఖంగా వినిపిస్తుంది.

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)