గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు
Breaking News
రూ.4000 కోట్లు కాదు.. దానిపై చర్చ జరగాలి: సల్మాన్ ఖాన్
Published on Sat, 11/07/2026 - 15:29
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రామాయణం’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి, మహేశ్‌బాబు, సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ, దర్శకుడు శంకర్ వంటి ప్రముఖులు సినిమాలోని విజువల్స్, నటీనటుల ప్రదర్శనలపై వారివారి అభిప్రాయాలను తెలిపారు.
‘రూ.4,000 కోట్లతో తెరకెక్కించారా?’
అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు తన తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రామాయణం’ చిత్రాన్ని రూ.4,000 కోట్లతో తెరకెక్కించారా? విజువల్స్ ఎలా ఉన్నాయి? అనే అంశాల కంటే.. రాముడు, సీత, రావణుడి పాత్రల గురించి చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.
రామాయణం గురించి మాట్లాడేటప్పుడు ఆ ఇతిహాసంలోని ప్రధాన పాత్రలు, కథ గురించి చర్చించాలన్నారు. సినిమా బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రామాయణం’. నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు. నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఇందులో యశ్ రావణుడి పాత్రలో కనిపించారు.
(ఇదీ చదవండి: సూర్య సూపర్ 'సీన్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు ?)
"#Ramayana movie ke baat karni hai to Ramayana par karo, na ki cost of making or VFX par. Ram ke upar baat karo, uski quality par. #Maatrubhumi me jo hero hai usme sab qualities hai Ram jaise" - #SalmanKhan https://t.co/5b8zaKeKU0
— $@M (@SAMTHEBESTEST_) November 6, 2026
Tags : 1