Breaking News

బిగ్‌బాస్ 10: గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావ్.. ఎమోషనల్ ఎలిమినేషన్

Published on Sun, 11/01/2026 - 10:36

రూమర్స్ వచ్చినట్లే రైతుబిడ్డ ఝాన్సీ ఎలిమినేట్ అయింది. రెడ్ లెవల్‌లోనే ఉండిపోయిన ఈమె.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా మొదటగా హౌస్ నుంచి బయటకొచ్చేసింది. ఈమె వచ్చేస్తున్నప్పుడు ముకేశ్ తెగ ఎమోషనల్ అయిపోయాడు. ఇంతకీ బిగ్‌బాస్ హౌస్‌లో 55వ రోజైన శనివారం(అక్టోబర్ 31) ఏం జరిగింది?

(ఇదీ చదవండి: మరో వివాదంలో 'ఇరుముడి'.. తెలంగాణ కార్మికశాఖ నోటీసులు)

నాగ్ ఎంట్రీ తర్వాత శుక్రవారం రాత్రి జరిగింది స్క్రీన్‌పై చూపించారు. మనలో ఎవరు కెప్టెన్ అయినాసరే త్రిగుణ్‌కి చుక్కలు చూపించాలి. స్కేల్‌కి ‍నూనె రాసి చితక్కొట్టాలని దారుణంగా మాట్లాడుకున్నారు. టీవీలోకి వచ్చిన నాగ్.. ఇంటి సభ్యులతో మాట్లాడటం మొదలుపెడతాడు. సుధీర్‌తో మీ వాళ్లు నిన్ను కాపాడారు కంగ్రాట్స్ అని చెప్పి నీ ఆట బాగుపడాలి అని జీరో స్టార్ ఇచ్చాడు. తర్వాత ఝాన్సీని నిలబెట్టి.. ఈ వారం నీ ఆట కనిపించలేదమ్మా, పవర్ వాడావు కదా మనస్ఫూర్తిగా వాడావా అని అంటే మనస్ఫూర్తిగా వాడాను అని చెప్పింది. నరేశ్‌తో ఫౌల్ గేమ్ ఆడావు. ఇలా అయితే రెడ్ నుంచి బయటకు వచ్చేది ఎప్పుడు? అని వీడియో చూపించి మరీ నాగ్ సీరియస్ అయ్యాడు.రామకృష్ణ ఆట కూడా బాగోలేదని చెప్పి జీరో స్టార్ ఇచ్చాడు.

నీతూతో ఒక వారం బాగా ఆడావు. ఈ వారం మరేం లేదు. కోచ్ పని మానేసి అంపైర్‌గా తయారయ్యావ్ అని ఈమెకి కూడా నాగ్ జీరో స్టార్ ఇచ్చారు. రాంప్రసాద్‌ ఆట చాలా బాగుందని చెప్పి ఫైవ్‌ స్టార్ట్‌లో రాంప్రసాద్‌కి ఇచ్చారు. నరేశ్‌ నీ ఆట కూడా బాగుంది. నువ్వు స్టార్స్‌ దక్కించుకున్నా లేకున్నా నువ్వు ఫైవ్‌ స్టార్‌నే. నువ్వు చెప్పిన వాటిలో 10 శాతం ముకేశ్ ఫాలో అయినా తన గేమ్ ఆ రేంజ్‌లో ఉండేదని అన్నాడు. వర్షిణికి త్రీ స్టార్‌ ఇ‍చ్చాడు. ఇక త్రిగుణ్ గురించి మాట్లాడుకున్న సంగతి గుర్తుచేసుకున్న నాగార్జున.. పీ అంటే ఏంటి వర్షిణి? అని అడిగాడు. గుర్తు లేదు అని వర్షిణి అంటే నరేశ్‌కి వర్షిణి చేతి మీద రాయమని చెప్పాడు. సుధీర్‌ని నిలబెట్టి బీ అంటే ఏంటి అని నాగ్ అడిగాడు. జోకర్ అన్నట్లు సార్ అంటే బీ అంటే జోకర్ ఎలా అవుతుంది అని ప్రశ్నించాడు. తర్వాత ఝాన్సీని నిలబెట్టి ఇదే ప్రశ్న అడిగాడు. వీడియో ఇక్కడ ప్లే చేయాలా కన్ఫెషన్‌ రూంలో వేయాలా అని అడిగితే వర్షిణి సీక్రెట్‌గా ప్లే చేయమని చెప్పింది. కానీ నాగ్ అందరి ముందు ప్లే చేశారు. ఈ వీడియో గురించి చెప్పడానికే మీకు ఇలా ఉంటే చూసేవాళ్లకు ఎలా ఉంటుందని త్రీ స్టార్‌లో ఉన్న వర్షిణిని జీరో స్టార్‌లో పెట్టారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో కీర్తి సురేశ్‌ ‘అక్క’ రివ్యూ)

శ్వేతకి మూడు స్టార్స్‌లో పెట్టి ఇంకా బాగుండాలి అని.. శివ్‌కి మూడు స్టార్స్‌ ఇచ్చి గ్రీన్‌లోకి ఎందుకు రాలేదు అంటే నాకు నామినేషన్‌లోకి రావాలని అనిపించింది.. గోట్ అవ్వడం కంటే జనాలకు శివ్ అనే వాడు ఒకడు ఉన్నాడని అనిపించుకోవాలని చెప్పాడు. దీంతో బాగా ఆడుతున్నావని నాగ్ చెప్పాడు. ఇక బ్రేక్‌ టైంలో బీ అంటే బఫూన్స్, పీ అంటే పపెట్స్ అని రోహిత్ అండ్ కో మాట్లాడుకున్నారు. నాగ్ వచ్చి బీ, పీ అంటే మీనింగ్స్ ఇవే అయితే ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగారు.

వంశీ ఆట బాగుందని చెప్పిన నాగ్.. దేబ్జానీకి నీ ఆటకి ఫైవ్ స్టార్ కానీ అల్టిమేట్ గోట్ కోసం నీ కష్టం సరిపోలేదు అందుకే మూడు స్టార్లు అని అన్నాడు. రోహిత్‌ని మొదటి 5 స్టార్స్‌లో పెట్టి ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అని నాగ్ అన్నాడు. తర్వాత 3 స్టార్స్ ఇచ్చాడు. ఆడియన్స్ నిన్ను 5 స్టార్‌లో ఆడుతావ్ అనుకుంటే అంతగా ఆడటం లేదని చెప్పి వీడియో చూపించి వర్షిణి, రోహిత్ మధ్య ఏదో జరిగిందని అన్నాడు. నువ్వు ఎందుకు ఎల్లోలోకి రాలేదు అంటే మా వాళ్లకి గ్రీన్‌లో పెట్టుకోవాలని ప్రయత్నించా అని చెప్పాడు. ఇప్పటికీ నువ్వు రెడ్‌లో ఉన్నావ్ కదా అని నాగ్ అంటే.. మా వాళ్లు నన్ను కాపాడుతారని అన్నాడు. అమన్‌ని 5 స్టార్స్‌లో పెట్టి ఆట చాలా బాగుందని నాగ్ మెచ్చుకున్నాడు. త్రిగుణ్‌ని అల్టిమేట్ గోట్ అని పొగిడి గేమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆడుతున్నావ్. అందరూ సపోర్ట్ చేశారు. అనంతరం ఇతడిని సీక్రెట్ గదిలోకి పిలిచి రోహిత్ తనని తిట్టి స్కేల్‌కి ఆయిల్ రాసి కొడతా అన్న విషయం వీడియో చూపిస్తారు. తర్వాత వర్షిణి, ముకేశ్, సుధీర్‌లతో త్రిగుణ్‌ వీక్‌నెస్ నాకు తెలుసు. వాడిని నేను దెబ్బకొడితే లేవలేడు అని చెప్పడం, త్రిగుణ్‌‌ని ఇబ్బంది పెట్టు అని సుధీర్.. ముకేశ్‌తో చెప్పడం అన్నీ చూపిస్తారు.

నాగ్ అందర్నీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి నామినేషన్లలో ఉన్న వారితో పాటు రెడ్ జోన్‌లో ఉన్న ఐదుగురైన ఝాన్సీ, రోహిత్, రాంప్రసాద్, శివ్, వంశీలలో ఒకరు ఓట్ల ప్రకారం  మరోకరు బిగ్‌బాస్ ప్రకారం ఎలిమినేట్ అవుతారని చెప్పి మిగతా వాళ్లతో కుండలు పగలగొట్టించి ఎవరికి తక్కువ సేఫ్‌లు వస్తే వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. ఐదుగురికి మూడు మూడు సేఫ్‌లు వస్తాయి. తర్వాత నాగ్.. అల్టిమేట్ గోట్ త్రిగుణ్‌ని యాక్టివిటీ ఏరియాకి పంపి అక్కడున్న నాలుగు కుండలు పగలగొట్టి ఎవరు సేఫ్ చెప్పమన్నాడు. రామకృష్ణ, వంశీ, రోహిత్, శివ్ సేఫ్ అయి ఝాన్సీ ఎలిమినేట్ అయింది. సుధీర్ తాను వెళ్లిపోతా.. ఝాన్సీని ఉంచమని నాగ్‌ని బ్రతిమలాడాడు. ముకేశ్, ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత  ఝాన్సీని పట్టుకొని తనతో క్లోజ్‌గా ఉండే.. త్రిగుణ్, అమన్, రోహిత్ అందరూ ఏడుస్తారు. నీ కల సాధిస్తావ్ మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావ్ ముకేశ్.. ఝాన్సీతో అన్నాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: షాకింగ్.. రోహిత్ ఎలిమినేట్)

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)