Breaking News

బిగ్‌బాస్ 10: సడన్ ఎలిమినేషన్.. రోహిత్ ఓవరాక్షన్

Published on Sat, 10/31/2026 - 10:43

రెడ్ లెవల్‌లో ఉన్నోళ్లు సూట్ కేసులు సర్దుకోండి. సడన్ ఎలిమినేషన్ అని చెప్పి బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అలానే అల్టిమేట్ గోట్ అయిన త్రిగుణ్.. అదిరిపోయే అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకీ హౌస్‌లో 54వ రోజైన శుక్రవారం(అక్టోబర్ 30) అసలేం జరిగిందనేది చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

గ్రీన్ లెవల్ సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ పెట్టారు. గ్రీన్ లెవల్‌లోనే అమన్ ఉన్నప్పటికీ నాగార్జున పనిష్మెంట్ ఇవ్వడంతో ఇతడికి పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇకపోతే కెప్టెన్సీ టాస్క్‌లో పోటీపడేవాళ్లు ముగ్గుర్ని సపోర్టర్స్‌గా ఎంచుకోవాలి. కంటెండర్స్ ఒక బంతిని స్టిక్‌పై పెట్టుకొని తీసుకెళ్లి సపోర్టర్స్‌లో ఒకరికి ఇవ్వాలి. అక్కడ బోర్డ్–బాల్ గేమ్‌లో వేయాలి. బంతి పడిన దాంట్లో ఉన్న సూచనలు బట్టి సపోర్టర్స్ కంటెండర్స్ కటౌట్స్‌ని కదపాలి. ఎవరి కటౌట్ ముందుకు వెళ్తే వాళ్లు గెలిచినట్లు. ఈ పోటీలో గెలిస్తే బిగ్‌బాస్‌లో ఉన్నంతకాలం కెప్టెన్సీ రేసులో నేరుగా పోటీ చేయొచ్చని బిగ్‌బాస్ ప్రకటించాడు.

ఇక సపోర్టర్స్ కోసం చాలాసేపు చర్చలు జరిగాయి. అమన్.. త్రిగుణ్ గెలవాలని కోరుకున్నాడు. అమన్ సపోర్టర్‌గా కావాలని త్రిగుణ్ అనగానే రోహిత్, ముకేశ్ వద్దని గొడవ పడ్డారు. నీ అంత కన్నింగ్ అని లేరని అమన్, రోహిత్ కూడా వాదించుకున్నారు. దాంతో అమన్ కూడా ఫైర్ అయ్యాడు. చివరికి ఓటింగ్ ద్వారా అమన్‌నే ఖరారు చేశారు. అమన్, వంశీ, శివ సపోర్టర్స్‌గా నిలబడ్డారు. రోహిత్ ఈ టాస్క్‌కి సంచాలక్‌గా వ్యవహరించాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)

ఈ పోటీలో చివరకు గెలిచిన త్రిగుణ్.. అల్టిమేట్ గోట్‌గా నిలిచి కెప్టెన్ అయ్యాడు. ఇదలా ఉండగానే రెడ్ లెవల్‌లో ఉన్నవాళ్లకు ఎలిమినేషన్ ఉంటుందని బిగ్‌బాస్ సడన్ ట్విస్ట్ ఇచ్చాడు. సూట్ కేసులు పంపించి బట్టలు సర్దుకోమని చెప్పాడు. ఝాన్సీ, శ్వేత, రామకృష్ణ, రోహిత్, సుధీర్.. వీళ్ళలో ఎవర్ని పంపాలనుకుంటున్నారో వాళ్ళ తలపై ఒక బాటిల్ కొట్టి ఎందుకో రీజన్ చెప్పాలని గ్రీన్ వాళ్లకు బిగ్‌బాస్ ఆదేశించాడు. రాంప్రసాద్ – రోహిత్, వర్షిణి – రామకృష్ణ , నీతూ – రామకృష్ణ , దేబ్జానీ – రోహిత్ , అమన్ – సుధీర్, ముకేశ్ – రామకృష్ణ, త్రిగుణ్– రోహిత్ తలపై బాటిల్స్ పగలగొట్టారు. మిగతావాళ్లు ఏం మాట్లాడకపోయినా రోహిత్ మాత్రం త్రిగుణ్‌పై అరవడం మొదలుపెట్టాడు. నిన్ను తొక్కుకుంటూ పైకి వెళ్తాను, నువ్వు లక్కుతో గెలుస్తున్నావు, నిన్ను రానివ్వను అని ఓవరాక్షన్ చేస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు.

ఇక గ్రీన్ వాళ్ళు ఓటింగ్‌లో రామకృష్ణకు ఎక్కువ ఓట్లు పడ్డప్పటికీ.. ప్రేక్షకుల ఓటింగ్ కారణంగా సుధీర్ ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఇంతలో ముకేశ్ తన మ్యాజిక్ పవర్ వాడతానని చెప్పడంతో బిగ్‌బాస్ ఆ బాక్స్ ఇచ్చాడు. ఎవరైనా పవర్ వాడేస్తే దాన్ని మరోసారి ఉపయోగించుకునేలా చేయొచ్చనేది ముకేశ్‌కి ఉన్న పవర్. దాంతో ఝాన్సీ ఎలిమినేషన్ ఫ్రీ పవర్ తిరిగి తెప్పించాడు. ఝాన్సీ.. సుధీర్ కోసం తన పవర్ ఉపయోగించి ఎలిమినేషన్ నుంచి తప్పించింది. ఇలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: సీఎం విజయ్ కుటుంబంలో విషాదం)

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)