Breaking News

జెన్‌ జెడ్‌ కొత్త భాష ఇదే! ఈ గుర్తులకు పూర్తి అర్థమేంటో తెలుసా!

Published on Sat, 10/31/2026 - 09:48

‘ఓకే’ అని ఒక సందేశం పంపితే అది అంగీకారమా? నిర్లక్ష్యమా? కోపమా? అన్న సందేహం రావచ్చు. అదే సందేశానికి ఓ నవ్వు బొమ్మ జతచేస్తే అర్థం వెంటనే మారిపోతుంది. ఓ హార్ట్‌ సింబల్‌ చేరిస్తే ప్రేమ కనిపిస్తుంది. కన్నీటి బొమ్మ పెడితే బాధతో చెప్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలా మాటల్లో దాగున్న మనసులోని ఆంతర్యాన్ని జోడిస్తున్నాయి ఈ చిన్ని గుర్తులు.

ఎదురెదురుగా ఉండి మాట్లాడేటప్పుడు ఎదుటివారి ముఖ కవళికలు, గొంతులోని మార్పులు, నవ్వు మనకు ఎన్నో విషయాలు చెబుతాయి. కానీ ఫోన్‌ లో సందేశం పంపేటప్పుడు అవన్నీ కనిపించవు. ఆ లోటును పూరించేందుకు ఎమోజీలు ఉపయోగపడుతున్నాయి. చిన్న సందేశంలోనే మన మనసులో అనుకునే భావాలను వ్యక్తపరిచే సాధనాలుగా మారాయి.

ప్రతి భావానికి ఒక రూపం..
తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌.. ఏ భాషలో మాట్లాడినా స్మైలీ సింబల్‌ని చాలామంది అర్థం చేసుకుంటారు. హార్ట్‌ సింబల్‌ ప్రేమను వ్యక్తం చేస్తున్నారని తెలుపుతుంది.

ఫైర్‌ బొమ్మను సందర్భాన్ని బట్టి ఉత్సాహానికి, లేదా ఏదైనా అద్భుతంగా ఉందని చెప్పడానికి ఉపయోగిస్తారు. అందుకే ఎమోజీలను ప్రపంచ భాషగా భావిస్తున్నారు నేటితరం. వేర్వేరు భాషలు మాట్లాడే వ్యక్తుల మధ్య కూడా ఇవి కొంతవరకు సంభాషణకు వారధిగా నిలుస్తున్నాయి. మాటలను అనువదించాల్సిన అవసరం లేకుండానే భావాన్ని ఊహించే అవకాశం కల్పిస్తున్నాయి.

సందర్భానికి తగినట్టు..
ఎమోజీలతో సంభాషణ సులభమైనా.. కొన్నిసార్లు అపార్థాలకూ దారితీస్తాయి. రెండు చేతులు జోడించిన గుర్తునే తీసుకోండి. కొందరు దాన్ని ప్రార్థనకు, మరికొందరు కృతజ్ఞతలు చెప్పడానికి లేదా నమస్కారానికి ఉపయోగిస్తారు. ఇంకాకొన్ని సందర్భాల్లో ‘నీకో నమస్కారం’అంటూ కోపాన్ని, అసహనాన్ని వ్యక్తం చేసే అర్థంలోనూ వాడుతుంటారు.

అలాగే నవ్వుతున్న బొమ్మ నిజమైన ఆనందాన్ని సూచించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో వెటకారాన్ని లేదా అసహనాన్ని వ్యక్తపరచవచ్చు. అంతేకాకుండా మెసేజ్‌ చేసిన వ్యక్తి ఉద్దేశమేంటో తెలియకపోతే ఎదుటివారు వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఎమోజీని మాత్రమే చూసి ఒకరి భావాలను పూర్తిగా అంచనా వేయడం సరికాదు. సందర్భం కూడా ముఖ్యమే.

జెన్‌జీ కోడ్‌!
జెన్‌ జెడ్, జెన్‌ ఆల్ఫా మాటల్లో ఎమోజీలకు ప్రత్యేక స్థానం ఉంది. మాటలతో పాటు బొమ్మలు, చిన్నచిన్న చిత్రాలు, మీమ్స్‌ కలిపి తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ఒక్క ఎమోజీ గుర్తుతోనే చె΄్పాలనుకున్న విషయాన్నంతా చెప్పేస్తున్నారు. అయితే, ప్రతి సందర్భంలోనూ వాటి అర్థం ఒకేలా ఉంటుందని చెప్పలేం.

ఉదాహరణకు, పుర్రె బొమ్మ కనిపిస్తే మరణాన్ని గుర్తు చేసుకోవడం సహజం. కానీ యూత్‌ దాని అర్థాన్ని మరోలా మార్చింది. ‘నవ్వలేక పోయాను’ అనే భావాన్ని సరదాగా వ్యక్తపరచడానికి కూడా ఈ గుర్తునే ఉపయోగిస్తున్నారు. అంటే ఎమోజీల అర్థాలు కాలంతో పాటు మారుతున్నాయి. కొత్త తరాలు వాటికి కొత్త అర్థాలు జోడిస్తున్నాయి. 

ప్రాంతాలు, సంస్కృతి, వయసు, సందర్భాన్ని బట్టి ఎమోజీల అర్థాలు మారుతుంటాయి. అందుకే ఎమోజీలను ఉపయోగించడంలోనూ ఒక ప్రత్యేకమైన అవగాహన అవసరం. సెన్సిటివ్‌ అంశాలు, బంధాల విషయంలో స్పష్టమైన మాటలే మంచిది.

సంతోషం, బాధ, ప్రేమ, కోపం.. వంటి మనసులోని భావాలను చె΄్పాలంటే ఇంతకుముందు ఎన్నో మాటలు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు అన్ని భావాలను ఎమోజీలే పలికిస్తున్నాయి. కోపానికి ఎర్రని ముఖం, ప్రేమకు రెడ్‌ హార్ట్, సంతోషానికి నవ్వు బొమ్మ. ఇలా వాట్సాప్‌ సందేశాల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ కామెంట్ల వరకు ఎక్కడ చూసినా ఇవే సందడి చేస్తున్నాయి.

ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా భావాలను అర్థం చేసుకునేలా చేస్తున్నాయి. అక్షరాలతో.. వంద మాటలతో పనిలేకుండా ప్రపంచాన్ని పలకరిస్తున్న ఈ చిన్ని గుర్తులు నేటి డిజిటల్‌ యుగపు భావోద్వేగ రూపాలు. అందుకే ఇప్పుడివి సరికొత్త గ్లోబల్‌ డిజిటల్‌ భాషగా మారిపోయాయి. భాషా సరిహద్దులను చెరిపివేసాయి.

ఇదీ చదవండి: గంటల ప్రయాణం.. ఒళ్లు అలసట.. దీనికి కారణమేంటో తెలుసా?

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)