Breaking News

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు

Published on Fri, 10/30/2026 - 09:05

మూవీ లవర్స్‌కి ఈ వీకెండ్ పండగే పండగ అని చెప్పొచ్చు. ఒకటా రెండా పదుల సంఖ్యలో కొత్త సినిమాలు, అవి కూడా తెలుగులోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. బత్తా, సిగ్మా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇమ్మోర్టల్, ఎస్సై యుగంధర్, అవరచన్ & బాయ్స్ లాంటి చిత్రాలతో పాటు అక్క, రుద్రవనం పీఎస్ లాంటి సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవలా ఉండగానే మరో రెండు కొత్త సినిమాలు సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.

(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' ట్విటర్ రివ్యూ)

శ్రీవిష్ణు హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'కామ్రేడ్ కళ్యాణ్'. మహిమా నంబియార్ హీరోయిన్. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ స్టోరీనే తీసుకున్నప్పటికీ దీనిని కామెడీగా తెరకెక్కించారు. ఈ నెల 02న థియేటర్లలో రిలీజై ఇప్పుడు నెల తిరిగేసరికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చూడొచ్చు.

'కామ్రేడ్ కళ్యాణ్' విషయానికొస్తే.. 90ల్లో ఆంధ్రా-ఒడిశా బోర్డర్ అది. అంతంత మాత్ర‌మే చ‌దువుకున్న తాడికొండ కల్యాణ్‌ (శ్రీవిష్ణు).. తన ఊరిలోనే ఓ థియేట‌ర్‌ లీజుకు తీసుకుని న‌డిపిస్తుంటాడు. అప్పుడే అక్క‌డి అడ‌వుల్లో న‌క్స‌లైట్ ద‌ళాల ఏరివేత కోస‌మ‌ని ఐపీఎస్ అధికారి జార్జ్‌కుట్టి (షైన్ టామ్ చాకో) వస్తాడు. మాస్టార్ (సాయిచంద్‌) దళానికీ, జార్జ్‌కుట్టీకి మ‌ధ్య యుద్ధం నడుస్తుండగానే.. అదే ఊరిలోని ఒరియా అమ్మాయి సితార‌దేవి (మ‌హిమా నంబియార్‌) వ‌స్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న త‌న త‌ల్లి స‌ర‌స్వ‌త‌మ్మ (రాధికా శ‌ర‌త్‌కుమార్‌)ని కాపాడిన సితార‌ని చూసి తొలి చూపులోనే కల్యాణ్ ప్రేమ‌లో ప‌డతాడు కళ్యాణ్‌. ఆమెతో క‌లిసి జీవితాన్ని పంచుకోవాల‌నుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా థియేట‌ర్‌ని న‌డిపే కల్యాణ్‌ కాస్త కామ్రేడ్ కల్యాణ్‌ అవుతాడు. పోలీసుల‌కు మోస్ట్ వాంటెడ్‌గా మారిపోతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

లాక్ డౌన్ టైంలో ఓటీటీల్లో సంచలన రేపిన సిరీస్ అంటే చాలామంది చెప్పేపేరు 'మీర్జాపుర్'. తెలుగు డబ్బింగ్ ప్రేక్షకుల్ని చాలా అలరించింది. ఇ‍ప్పటికే మూడు సీజన్లు వచ్చాయి. అయితే ఓ కొత్త కథతో ఈ ఫ్రాంచైజీ నుంచి సినిమా వచ్చింది. గత నెల 04న థియేటర్లలో రిలీజైంది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు దీనిని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండానే తీసుకొచ్చారు. థియేటర్లలో క్రిస్పీ రన్ టైంతో రిలీజ్ కాగా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అదనంగా సీన్స్ జోడించి రిలీజ్ చేశారు. మొత్తం మూడున్నర గంటల నిడివితో ఓటీటీలో హిందీలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ మరికొన్నిరోజుల పట్టేలా ఉంది.

'మీర్జాపూర్' విషయానికొస్తే.. అఖండానంద్‌ త్రిపాఠి అలియాస్‌ ఖాలీన్‌ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) మీర్జాపూర్‌కు అప్రకటిత రాజు. పూర్వాంచల్‌కే కాదు మొత్తం యూపీ రాజకీయాలనే శాసించే శక్తి అవుతారు. ఖాలిన్‌ భయ్యా చేసే ప్రతి పని, సెటిల్‌మెంట్‌ను చక్కబెడుతూ అతడికి కుడి, ఎడమ భుజంగా గుడ్డు (అలీ ఫజల్‌), బబ్లూ (జితేంద్ర కుమార్‌) ఉంటారు. ఖాలీన్‌ భయ్యా కొడుకు మున్నా (దివ్యేందు). తండ్రిలా మీర్జాపూర్‌ను శాసించాలని ఉన్నా, తన దుందుడుకు స్వభావం కారణంగా ఎప్పుడూ తప్పులు చేస్తూ ఉంటాడు. మీర్జాపూర్‌ సింహాసనంపై కన్నేసిన బబన్‌ యాదవ్‌ (రవి కిషన్‌) ఒక డీల్‌తో త్రిపాఠి వద్దకు వస్తాడు. అందుకు త్రిపాఠి కూడా ఒప్పుకొంటాడు. దీంతో బబన్‌ యాదవ్‌ ఓ షరతు పెడతాడు. అందుకు కూడా త్రిపాఠి అంగీకరిస్తాడు. ఇంతకీ బబన్‌ యాదవ్‌ ఎందుకు మీర్జాపూర్‌ సింహాసనం ఎక్కాలనుకున్నాడు? అతడి కుట్ర గురించి త్రిపాఠికి ఎలా తెలిసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)

Videos

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర..

పెను ముప్పు పొంచి ఉందా? US, UK, జ‌పాన్ జారీ చేసిన రెడ్ అల‌ర్ట్!

అందుకే టీడీపీకి రాజీనామా చేశా... కడప టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జమ్మలమడుగులో హై టెన్షన్ YSRCP నేత కారుపై దాడి

చిలకలూరిపేట ప్రచారంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు!

YSRCP ఏజెంట్ కు ఎన్నికల అధికారి బెదిరింపులు..! ఆడియో వైరల్..

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)