అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా: త్రివిక్రమ్‌

Published on Thu, 10/29/2026 - 16:06

ఆదర్శ కుటుంబం సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి కాళ్లకు దర్శకుడు త్రివిక్రమ్‌  దండం పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీనిధి శెట్టి దర్శకుడు త్రివిక్రమ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి పలకరించారు. ఈ క్రమంలో ఆయన శ్రీనిధి కాళ్లకు నమస్కరించబోయారు. దీంతో ఆశ్చర్యానికి గురైన శ్రీనిధి వెంటనే ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు త్రివిక్రమ్‌ చేసిన పనిని సమర్థిస్తుంటే.. మరికొంతమంది మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరున్న త్రివిక్రమ్.. తనకంటే వయసులో చిన్నదైన హీరోయిన్‌కు అలా నమస్కరించేందుకు ప్రయత్నించడం అవసరమా? అంటూ ట్రోల్‌ చేశారు. 

తాజాగా ఈ ఘటనపై త్రివిక్రమ్‌  స్పందించారు. శ్రీనిధితో ఉన్న చనువుతో సరదాగా అలా కాళ్లకు దండం పెట్టానని చెప్పారు. గురువారం ఆదర్శ కుటుంబం సినిమా బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా శ్రీనిధి కాళ్లకు దండం ఎందుకు పెట్టారని ఓ మీడియా ప్రతినిధి ఆడగా​.. దానికి త్రివిక్రమ్‌ ఇలా సమాధానం చెప్పారు.

ఇదీ చదవండి: శ్రీనిధి శెట్టి పాదాలకు నమస్కరించిన త్రివిక్రమ్‌.. అసలేం జరిగింది?

‘నేను ఇప్పటిదాకా పని చేసిన హీరోయిన్లలో నాకు బాగా దగ్గరైన నటి శ్రీనిధి. నేను మాములుగా అందరితోనూ కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటాను. కానీ శ్రీనిధి.. అందరికంటే ఎక్కువగా, ఫ్యామిలీ మెంబర్‌లా కలిసిపోయింది. ఆ చనువుతోనే.. కామెడీగా ఆమె కాళ్లకు దండం పెట్టా. ఇద్దరు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మధ్య సరదాగా ఆటపట్టించే అలవాటు ఉంటుంది కదా.. నేను అలానే ఆమె కాళ్లకు దండం పెట్టినట్లు నటించా. అంతకు మించి వేరే ఉద్దేశ్యం ఏం లేదు’ అన్నారు. 

ఆదర్శ కుటుంబం ఈవెంట్‌ విషయానికొస్తే.. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించారు. శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లు. ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)