మిద్దె తోటలో బేకింగ్‌ సోడా.. ఈ ప్రయోజనాలు తెలుసా?

Published on Fri, 10/23/2026 - 09:37

మిద్దె /పెరటి తోటల్లో  మొక్కలకు వచ్చే వివిధ రకాల ఫంగస్, తెగుళ్లు, పురుగుల నివారణకు బేకింగ్‌ సోడా (వంట సోడా & Sodium Bicarbonate) ఒక అద్భుతమైన, తక్కువ ఖర్చుతో కూడిన సేంద్రియ నివారణ మార్గం. ఇది మొక్కల ఆకులపై తెల్లటి బూజు తెగులు, నల్ల మచ్చలను తగ్గించటంలో సహాయపడుతుంది.

1. బేకింగ్‌ సోడా ద్రావణం తయారు చేసే విధానం: 1 లీటరు నీరు + 1 టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడా + 1 టీస్పూన్‌ మైల్డ్‌ లిక్విడ్‌ సోప్‌ (లేదా వంట నూనె) బాగా కలపాలి.   
2. చిక్కుడు, గుమ్మడి, దోస, టమాటా వంటి మొక్కలకు వచ్చే తెల్లటి బూజు, ఆకులపై నల్ల మచ్చల నివారణకు ఈ ద్రావణం బాగా ఉపయోగం. 
3. అఫిడ్స్, నల్లి, గొంగళి పురుగులు వంటి మెత్తటి శరీరం గల కీటకాలను, వాటి సంతతిని అరికడుతుంది.

4. మిద్దె తోటలో చీమల నివారణకు బేకింగ్‌ సోడాను ఉపయోగించవచ్చు. అయితే, దీన్ని నేరుగా మొక్కల మీద కాకుండా, చీమలు తిరిగే మార్గాల్లో మాత్రమే ఉపయోగించాలి.  సమపాళ్లలో బేకింగ్‌ సోడా, పంచదార పొడి బాగా కలపి ఈ మిశ్రమాన్ని చిన్న మూతల్లో/ చిన్న పళ్లెంలో వేసి చీమలు ఎక్కువగా తిరిగే కుండీల అంచుల వద్ద లేదా నేల మీద ఉంచాలి. తీపికి ఆకర్షితమై చీమలు ఈ మిశ్రమాన్ని తింటాయి. అది వాటి పొట్టలోకి వెళ్లగానే బేకింగ్‌ సోడా రసాయనిక చర్య జరిపి కార్బన్‌ డయాక్సైడ్‌ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల చీమలు చనిపోతాయి.

5. మట్టి కొద్దిగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటే, బేకింగ్‌ సోడా దాన్ని కొద్దిగా ఆల్కలీన్‌ (క్షార) స్థితికి తెస్తుంది.
6. టమాటా మొక్కల మొదళ్ల చుట్టూ కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లటం ద్వారా 
మట్టిలోని ఆమ్లతను తగ్గించి, టమాటాలు మరింత రుచిగా /తీయగా మారేలా 
చేయవచ్చు.

7. బేకింగ్‌ సోడాను మితిమీరి వాడితే మొక్కల ఆకులు కాలిపోయే అవకాశం ఉంది. ద్రావణం పలుచగా ఉండేలా చూసుకోవాలి (1% కంటే ఎక్కువ ఉండకూడదు). మట్టిలో సోడియం శాతం పెరిగి మొక్కల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
8. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేయకూడదు. తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో స్ప్రే చేయటం మంచిది. ఒకేసారి అన్ని మొక్కలపై కాకుండా, ఒక చిన్న కొమ్మపై స్ప్రే చేసి 24 గంటల తర్వాత ఫలితాన్ని గమనించి, మిగిలిన మొక్కలకు వాడాలి.
9. తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు వారానికి 1–2 సార్లు పిచికారీ చేయాలి.

- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్‌: 94906 02366

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ఇదీ చదవండి: భూతాపంతో రైతులకు పెను ముప్పు.. ఐరాస హెచ్చరిక!

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)