Breaking News

గోధుమకు ‘వేడి’ సెగ

Published on Tue, 10/20/2026 - 06:26

మూలిగే నక్కపై తాటిపండు పడనుందా? ఇప్పటికే భూగోళమంతటినీ శరవేగంగా వినాశనం వైపు నెడుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ అతి త్వరలో ప్రపంచ ఆహార భద్రతను కూడా మరింతగా దెబ్బతీయబోతోందా? వాతావరణంలో నానాటికీ పెరిగిపోతున్న కార్బన్‌ డయాక్సైడ్‌ (సీఓటూ)తో అత్యధిక దేశాల్లో ప్రధాన ఆహార ధాన్యమైన గోధుమ దిగుబడితో పాటు నాణ్యత కూడా బాగా తగ్గనుందా? అలాంటి ప్రమాదం నిజంగానే పొంచి ఉందని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం ఒకటి!

అదే గనక జరిగితే ప్రపంచ ఆహార భద్రత కాస్తా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి జారడం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి...!  ఎల్‌ నినో దెబ్బకు అసలే ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. ఆహారోత్పత్తి గణనీయంగా పడిపోయి అన్ని దేశాలనూ అమితంగా కలవరపెడుతోంది. యూరప్‌వ్యాప్తంగా కొద్ది రోజులుగా ఊపందుకుంటున్న జనాందోళనలకు తిండి గింజల కొరత కూడా ఓ ప్రధాన కారణంగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో మ్యూనిక్‌ (జర్మనీ)లోని లెబ్నిజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ టెక్నికల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం మరో బాంబు పేల్చింది. వాతావరణంలో నానాటికీ పెరిగిపోతున్న సీఓటూ గోధుమల్లోని ప్రొటీన్‌ కూర్పును నేరుగా దెబ్బ తీయనుందని అది జరిపిన తాజా అధ్యయనం తేల్చింది! ‘‘దాంతో ఈ కారణంగా గోధుమల నాణ్యత విపరీతంగా తగ్గవచ్చు. ఫలితంగా బ్రెడ్‌తో పాటు గోధుమలతో తయారయ్యే అన్ని ఆహార పదార్థాల్లో పోషకాల స్థాయిలు కూడా బాగా పడిపోతాయి’’అని అధ్యయన బృంద సారథి సబ్రీనా గెస్లిట్జ్‌ ఆందోళన వెలిబుచ్చారు.

 ‘‘ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సీఓటూ సాంద్రత ఇప్పటికే ప్రమాదకర వేగంతో పెరిగిపోతోంది. 1980ల్లో 340 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉన్నది కాస్తా 2024 నాటికి 425 పీపీఎంకు పెరిగింది. కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌ ఇలాగే కొనసాగితే 2050 కల్లా అది ఏకంగా 600 పీపీఎంకు చేరినా ఆశ్చర్యం లేదు. పెరుగుతున్న సీఓటూ స్థాయిలతో గోధుమపై పడే ప్రభావాన్ని మా బృందం లోతుగా అధ్యయనం చేసింది. ఎంచుకున్న పది గోధుమ రకాల్లో కొన్నింటిని బయటి వాతావరణంలో పండించాం. మరికొన్నింటిని కృత్రిమ పరిస్థితుల్లో 546 పీపీఎం సీఓటూ స్థాయిల్లో పండించి చూశాం.

 అలా పండిన గోధుమల్లో ప్రొటీన్‌ కూర్పు గణనీయంగా మార్పులకు లోనైంది. ఆరోగ్యానికి హానికరమైన అమైలేజ్, ట్రిప్సిన్‌ ఇన్హిబిటర్స్‌ తదితరాల స్థాయి పెరిగింది. ప్యూరోఇండోలైన్స్‌ వంటి ఆరోగ్యకరమైన గ్లూటెన్‌ ప్రొటీన్ల స్థాయి మాత్రం తగ్గింది’’అని ఆమె వివరించారు. ‘‘దీనివల్ల గోధుమను ప్రధాన ఆహారంగా తీసుకునే వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది దాంతో దీర్ఘకాలంలో వారు నానా రకాల ఆరోగ్య సమస్యల బారిన పడవచ్చు’’అని లెబ్నిజ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫుడ్‌ బయోపాలిమర్‌ కెమిస్ట్రీ రీసెర్చ్‌ గ్రూప్‌ సారథి క్యాథరినా షెర్ఫ్‌ ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రఖ్యాత ‘జర్నల్‌ ఫుడ్‌ కెమిస్ట్రీ’లో ప్రచురితమయ్యాయి.

ఇదీ చదవండి: డబ్బున్నోళ్లకే గుండె జబ్బుల ముప్పు!

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)