Breaking News

గరివిడి లక్ష్మి కాళ్లపై షకలక శంకర్‌.. చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ..

Published on Sun, 10/18/2026 - 16:40

ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి రెడ్డి విజయ లక్ష్మి( గరివిడి లక్షి) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ఆనంది ప్రధాన పాత్ర పోషించారు. గౌరీ నాయుడు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంది. తాజాగా సక్సెస్‌ మీట్‌ను చిత్రబృందం నిర్వహించింది. 

ఈ కార్యక్రమంలో భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు షకలక శంకర్.. అసలైన గరివిడి లక్ష్మి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆమె కళను కొనియాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.

కళాకారులందరినీ ఆశీర్వదించు తల్లి..
‘మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ తర్వాత అంతటి వేగం, ఉత్సాహంతో కూడిన నృత్యాన్ని గరివిడి లక్ష్మి ప్రదర్శనలోనే చూశాను. నిజమైన నృత్యం, స్వచ్ఛమైన జానపద కళ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో లక్ష్మమ్మ బుర్రకథలు చూడాలి. కళాకారులను బతికించడానికే ఆ తల్లి ఇంకా మన మధ్య ఉంది. తెలుగు ప్రేక్షకులు ఉన్నంతకాలం ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని భావోద్వేగంగా చెప్పారు. అనంతరం ‘మా కళాకారులందరినీ ఆశీర్వదించు తల్లీ’ అంటూ గరివిడి లక్ష్మి పాదాలకు నమస్కరించారు. 

(ఇదీ చదవండి: నా ముఖం ఉబ్బినట్లు ఉందని.. ఏడాదిగా గ్యాలరీలో..: హీరోయిన్‌)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)