చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన వంశీ.. డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు..!

Published on Fri, 10/16/2026 - 07:35

ప్రస్తుతం బిగ్‌బాస్ షో ఆరో వారం కొనసాగుతోంది. ఇప్పటికే నామినేషన్స్ పూర్తి కాగా.. ఈ వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్‌ మిగిలారు.  అలా ఈ వారంలో వంశీ, అమన్, వర్షిణి, రామ్ ప్రసాద్, షాలిని, రోహిత్ నామినేషన్స్‌లో నిలిచారు. ఇప్పటికే ఓటింగ్ మొదలవ్వగా.. షాలిని, వర్షిణి డేంజర్‌ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఓటింగ్‌లో రోహిత్‌ దూసుకెళ్తున్నాడు. ఈ వీకెండ్‌లో ఎవరు హౌస్‌నుంచి ఎలిమినేట్ అవుతారనే విషయంపై క్లారిటీ రానుంది. ఇక తాజా ఎపిసోడ్లో ఏం జరిగిందో హైలెట్స్‌లో చూసేద్దాం.

దశావతారంలో భాగంగా రోడ్ బ్లాక్ అనే టాస్క్‌ హౌస్‌లో కొనసాగుతోంది. గత వీకెండ్‌లో ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ ఫైర్స్‌కు.. హౌస్‌లోని ఓజీస్‌కు మధ్య బిగ్‌బాస్ పోటీపెట్టారు. టాస్క్‌లతో కంటెస్టెంట్స్‌ను పరిగెత్తిస్తున్నారు. పజిల్‌ గేమ్‌లో గ్రీన్, బ్లూ, ఎల్లో టీమ్స్‌గా పోటీపడ్డారు. ఈ గేమ్‌లో షాలిని సంచాలక్‌గా వ్యవహరించారు. మధ్యలో కాస్తా వాగ్వాదం చోటు చేసుకుంది.

(ఇది చదవండి: తన్నుకున్నంత పనిచేసిన వంశీ, రోహిత్.. నామినేషన్స్‌లో ఎవరెవరంటే?)

అంతేకాకుండా వంశీ, శివకుమార్‌ ఓ టాస్క్‌లో పోటీ పడ్డారు. గార్డెన్ ఏరియాలో ఓ ప్లేట్‌, బౌల్‌ ఉంది. అది తీసుకొచ్చి పెడస్టల్‌ మీద పెట్టాలని బిగ్‌బాస్ చెప్పారు. ఆ బౌల్‌ వంశీ చేతికి చిక్కింది. అది తీసుకొచ్చే క్రమంలో శివకుమార్‌.. వంశీ చేతిలోని ప్లేట్, బౌల్‌ను లాగేసుకున్నారు. ఆ తర్వాత వెంటనే తీసుకొచ్చి పెడస్టల్‌ మీద పెట్టాడు. ఈ గేమ్‌లో సంచాలక్‌గా ఉన్న త్రిగుణ్.. శివకుమార్‌నే విజేత ప్రకటించాడు. దీంతో వంశీ తన కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేకపోయాడు. తన చేతులతో తన చెంపలనే వాయించుకున్నాడు. ఆ తర్వాత ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. అతన్ని త్రిగుణ్ సైతం వంశీ హత్తుకుని ఓదార్చాడు. అలా గేమ్‌లో తీవ్రమైన భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి.

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)