పెద్దాపురంలో టీడీపీ కార్యకర్త హుల్ చల్, కన్నీళ్లు పెట్టుకున్న సూరిబాబు రాజు
Breaking News
నేరుగా ఓటీటీకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Published on Thu, 10/15/2026 - 13:25
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయీ నటించిన లేటేస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గజబ్ రాత్. ఈ మూవీకి నీరజ్ పాండే, రితేశ్ షా సంయుక్త దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 23న నేరుగా నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో పోలీస్ అధికారిగా మనోజ్ భాజ్పేయి అభిమానులను మెప్పించనున్నారు.
ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ ఈ మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. కాగా.. మొదట ఈ సినిమాకు ఘూసఖోర్ పండత్ అనే పేరును ఖరారు చేశారు. ఆ టైటిల్తోనే కొన్ని ప్రచార చిత్రాలనూ విడుదల చేశారు. ఆ తర్వాత సినిమా పేరు, మనోజ్ పాత్రపై తీవ్ర వివాదానికి దారితీసింది. మూవీ టైటిల్, స్టోరీ లైన్ తమ వర్గాన్ని కించపరిచేలా ఉందని దర్శకులపై బ్రాహ్మణసంఘం ఫిర్యాదు చేసింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ ఆ సంఘం కోర్టును ఆశ్రయించింది. దీంతో మేకర్స్ సినిమా పేరును వెంటనే మార్చేశారు. గజబ్ రాత్గా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో నుష్రత్ భరుచ్చా, సాకిబ్ సలీమ్, దివ్యా దత్తా, కికు శారదా, శ్రద్ధా దాస్ కీలక పాత్రల్లో నటించారు.
Tags : 1