Breaking News

నా ఫ్లాఫ్ చూసి కొందరు ఎంజాయ్ చేశారు: విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

Published on Wed, 10/14/2026 - 09:03

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. రాయలసీమలో బ్రిటీశ్ కాలంలో జరిగిన ఆకృత్యాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారని.. ఆనాటి దారుణ పరిస్థితులను ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ‍అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా నోటా మూవీ సరిగా ఆడకపోవడంతో అందరు నన్ను ట్రోల్స్ చేశారని అన్నారు. ఆ సమయంలో నేను కూడా ఫీల్ అయ్యానని.. అప్పుడు అందరికీ ఐ విల్‌ బీ బ్యాక్ ‍అని లెటర్ రాశానని చెప్పుకొచ్చారు. అయితే కొందరు ఫెయిల్యూర్‌ చూసి ఎంజాయ్ చేశారని తెలిసిందన్నారు. అందుకే నా ఈగో హార్ట్ ‍అయిందన్నారు.  ఇప్పుడు మళ్లీ రణబాలితో మీ ముందుకొస్తున్నానని.. ఆ రోజు టాక్సీవాలా సక్సెస్ మీట్‌లో బ్లడీ షూర్ ఐ విల్ బి బ్యాక్ చెప్పానని గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు మీరు ఆదరిస్తే మళ్లీ సక్సెస్ మీట్‌కు వచ్చి అందరి ముందు మళ్లీ గుర్తు చేస్తానని విజయ్ దేవరకొండ అన్నారు. ఈసారి మనం అనుకున్నది జరిగిందంటే... అనంతపూర్‌లో మీ అందరి ముందు మళ్లీ గుర్తు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. మనకు తెలిసింది మన అందరికీ తెలిసిందే ఒకటే, మన చేతిలో రెండే ఉంటాయి.. మన మీద మనకున్న నమ్మకం, మనం చేసే పనిలో పూర్తిగా ప్రాణం పెట్టి చేయడమని మాట్లాడారు. రాహుల్ కేవలం కెరీర్ కోసం సినిమాలు తీయడని.. బలమైన కథలు చెప్పాలని ప్రయత్నిస్తుంటాడని డైరెక్టర్‌ను విజయ్ కొనియాడారు.

ఇదీ చ‌ద‌వండి: రష్మికకు విజయ్ థ్యాంక్స్

Videos

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బుద్ధిలేని గేమ్.. హౌస్ లో మరో బిగ్ ట్విస్ట్

ఏపీ లోకల్ ఫెట్ మూడు దశల్లో మున్సిపల్ ఎన్నికలు

Photos

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)

+5

రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. విరోష్ జంట క్యూట్‌ మూమెంట్స్ (ఫోటోలు)

+5

'ఆలియాస్ రుక్మిణీ'గా ఆఫియా సయ్యద్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)

+5

‘గరివిడి లక్ష్మి’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)