జోహోకు ఏఐ ఖర్చుల కష్టాలు

Published on Wed, 10/14/2026 - 08:42

కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాలపై వ్యయాలు భారీగా పెరిగిపోతుండటం, సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో అనిశ్చితి నెలకొనడంలాంటి అంశాల కారణంగా వార్షిక వేతనాల పెంపునకు ఈ ఏడాది విరామం ఇచ్చినట్లు దేశీ టెక్నాలజీ సంస్థ జోహో కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు తెలిపారు. అలాగే మార్కెటింగ్‌ వ్యయాలను కూడా తగ్గించుకున్నట్లు వివరించారు.

‘అంతర్జాతీయంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాల పరిస్థితి అంత ఆశావహంగా లేదు. సాఫ్ట్‌వేర్‌ వ్యాపార భవిష్యత్తు అనిశ్చితిగా ఉంది. ఏఐ వల్ల ఖర్చులు పెరిగిపోయాయి. డేటా సెంటర్లకు కావాల్సిన సర్వర్ల రేట్లు ఏకంగా 4 రెట్లు ఎగియడం, ఏఐ వినియోగం వేగంగా పెరగడం ఇందుకు కారణం. వీటిని కట్టడి చేసేందుకు మేము ప్రయతి్నస్తున్నాం. ఇక అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల కూడా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి’ అని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో చేసిన ఒక పోస్టులో ఆయన వివరించారు.

ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ‘మా కంపెనీలో మార్కెట్‌ బడ్జెట్‌ను కుదించుకున్నాం. అలాగే ఈ ఏడాది వేతనాల పెంపు ఉండదని ఉద్యోగులకు తెలియజేశాం. దీన్ని నివారించలేకపోవడంపై వారిని క్షమాపణలు కోరాను. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ఉద్యోగులకు కృతజ్ఞతలు’ అని శ్రీధర్‌ పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఉద్యోగాల కోతను నివారించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని, కానీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పరిస్థితి అంత ఆశావహంగా కనిపించడం లేదని వివరించారు. తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకోవడంపై కసరత్తు చేస్తున్నామని, ఇది పని చేసిందా లేదా అనేది వచ్చే 3–5 ఏళ్లలో తెలుస్తుందన్నారు.

ఇదీ చదవండి: రచ్చకెక్కిన టీవీఎస్ ఫ్యామిలీ వార్

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)