Breaking News

అమ్మాయిగా మారి నేటికి పదేళ్లు.. ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ ప్రియాంక ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Mon, 10/05/2026 - 16:59

బుల్లితెరపై తనదైన కామెడీ, అల్లరితో ప్రేక్షకులను అలరించిన ప్రియాంక సింగ్‌.. తన జీవితంలో ఎన్నో సవాళ్లను దాటి ఈ స్థాయికి చేరుకుంది. ‘జబర్దస్త్‌’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత ‘బిగ్‌బాస్‌’ ఐదో సీజన్‌లో అడుగుపెట్టి మరింత దగ్గరైంది. అయితే తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ప్రియాంక జీవితం వెనుక ఎన్నో కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, ఒంటరి పోరాటం ఉన్నాయని కొంతమందికే తెలుసు.

ఇదే విషయాన్ని.. తాను కోరుకున్న జీవితాన్ని సొంతం చేసుకునేందుకు పదేళ్ల క్రితం వేసిన అడుగు గురించి తాజాగా సోషల్‌మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ పెట్టింది. ఇప్పుడీ పోస్ట్‌ అభిమానులకు కన్నీరు తెప్పిస్తోంది. అసలు ఆమె ఎవరు.. అని నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ విషయాలు ఒకసారి చూద్దాం.

(ఇదీ చదవండి: సోషల్ మీడియాకు భయపడి 'ఆదర్శ కుటుంబం' వాయిదా)

‘అప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి’
‘పదేళ్లు గడిచాయంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అప్పట్లో నేను ఎదుర్కొన్న బాధ, కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, ఒంటరితనం అన్నీ ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ‘ఏం చేయాలి? అసలు నేను ఎవరు?’ అని ఎన్నోసార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నా. అయినప్పటికీ నేను కోరుకున్న వ్యక్తిగా జీవించాలనే పట్టుదలతో ముందుకు సాగాను’ అని ప్రియాంక పేర్కొంది.

‘నేను సాధించాను’
గడిచిన పదేళ్లలో వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌లోనూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని ఆమె తెలిపింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను కృంగిపోలేదని చెప్పింది. ‘ఈ రోజు అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ‘నేను సాధించాను’ అని గర్వంగా చెప్పుకోగలను. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నాను. ఈ అందమైన జీవితాన్ని, ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చిన విశ్వానికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.

తన పదేళ్ల క్రితం ప్రారంభించిన ప్రయాణాన్ని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తనకు తానే గర్వంగా అనిపిస్తోందని ప్రియాంక తెలిపింది. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రియాంక ధైర్యాన్ని మెచ్చుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు.

(ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. పొలిటికల్‌ ఎంట్రీకి సిద్ధమా?)

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)