Breaking News

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా

Published on Wed, 09/30/2026 - 11:06

ఈ వారం ఓటీటీల్లోకి బెత్లెహెమ్ కుడుంట యూనిట్, రోమాంచకం, సర్దార్ 2, పూజా మేరీ జాన్ తదితర సినిమాలతో పాటు #లవ్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్ రాబోతున్నాయి. వీటితో పాటు ఏకంగా 23కి పైగా మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇవలా ఉండగానే ఓ తెలుగు చిత్రం ఏ మాత్రం హడావుడి లేకుండా మూడు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

అందరూ కొత్త కుర్రాళ్లతో చేసిన తెలుగు కామెడీ డ్రామా సినిమా 'అమీర్ లోగ్'. రమణా రెడ్డి సోమ దర్శకుడు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. కొత్తోళ్లతో తీసిన చిత్రం కావడం, రవితేజ 'ఇరుముడి' ఎఫెక్ట్ వల్ల ఇదొకటి వచ్చిందనే సంగతి జనాలకు తెలియలేదు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ చిత్రం ఆహా, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ ఓటీటీల్లోకి వచ్చేసింది.

'అమీర్ లోగ్' విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో శ్రీను (MC హరి), ఫరూక్ (మనోజ్), మల్లేశ్(శశిధర్) అని ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. పనిపాటా లేకుండా తిరుగుతూ, తాగుతూ జులాయిగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఓ రోజు అదే బస్తీకి చెందిన నజీర్ (సాయియోగి)తో క్రికెట్ విషయమై గొడవ జరుగుతుంది. వీరి పరిస్థితి గమనించిన అదే బస్తీకి చెందిన గీత (వేద జలంధర్) వీరిని తమ్ముళ్లుగా భావించి బుద్ధి చెప్పి మారమని సూచిస్తుంది. ఆమె సాయంతో శ్రీను ఓ ఆఫీస్‌లో ఆఫీస్ బాయ్‌గా చేరతాడు.

అయితే తన ఆఫీస్ వాళ్లతో క్రికెట్ ఆడిన శ్రీను.. ‘మా బస్తీ వాళ్లు మీకంటే బాగా ఆడతారు’ అని పంతానికి పోయి బెట్ కడతాడు. ఆ మ్యాచ్‌లో బస్తీ టీమ్ గెలిచిందా? లేదా? బస్తీలోని పెద్దాయన చాచా (విశ్వేందర్) వీరికి ఏ విధంగా సాయపడ్డాడు? ఈ కథలోకి ‘బిర్యానీ’ కాన్సెప్ట్ ఎలా ప్రవేశించింది? గీత ప్రియుడు రవి (రావణ్) వల్ల ఈ ముగ్గురి జీవితాలు ఎలా మారాయి? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)

Videos

వివేకా హత్య కేసులో ముసుగు తీసిన పచ్చ గొడ్డలి

ఆర్మీ జవాన్ కిషన్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

ప్రాణాలకు తెగించి అడ్డుకున్న ఇండియన్ పైలట్.. 180 మంది సేఫ్

9/11 తరహాలో కుట్ర జరిగిందా..? ఫ్లై దుబాయ్ ఎమర్జెన్సీ లాండింగ్ లో సంచలన విషయాలు

ఇదంతా నువ్వే చేయిస్తున్నావ్ అని నాకు తెలుసు.. వివేకా అల్లుడా నీకే చెప్తున్నా

ఫిలిం ఛాంబర్ లో సుమలత రచ్చ రచ్చ

వైఎస్ జగన్ ను కలిసిన లంకపల్లి రైతులు

జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడు? చెప్పు తీసుకుని తరిమి తరిమి కొడతాం...

కోహ్లి నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

రజనిపై పోలీసుల తీరు.. ఇచ్చిపడేసిన విశాఖ అడ్వకేట్స్

Photos

+5

భారత్‌ వర్సెస్‌ విండీస్‌ మ్యాచ్ హైలైట్స్ ఫోటోలు!

+5

హైదరాబాద్ ధూల్ పేట్ లో దుర్గమ్మ విగ్రహాలు (ఫొటోలు)

+5

డ్యాన్స్ అకాడమీలో మెరిసిన హీరోయిన్స్ నివేదా, ఈషా రెబ్బా.. ఫోటోలు

+5

'డోంట్ ‍ట్రబుల్ ద ట్రబుల్'తో రాబోతున్న ఈ పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు (ఫొటోలు)

+5

నల్లటి చీరలో 'తత్వం' సినిమా హీరోయిన్ దశ్విక... ఈమె గురించి తెలుసా?

+5

చెమట చిందిస్తూ.. కండలు చూపిస్తూ తిలక్‌ వర్మ (ఫొటోలు)

+5

'డిసి' ఫేమ్ వామికా గబ్బి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లేత గులాబీ రంగు చీరలో నిహారిక మెరుపులు (ఫొటోలు)

+5

వైరల్ మూవీ.. కీర్తి సురేశ్ 'డోరోతి' జ్ఞాపకాలు (ఫొటోలు)