Breaking News

రూ.33 కోట్లు పెట్టి ఇల్లు కొన్న 'ధురంధర్' విలన్.. స్పెషలేంటి?

Published on Tue, 09/29/2026 - 13:35

మనలో ఎంత టాలెంట్ ఉన్నాసరే దానికంటూ ఓ టైమ్ రావాల్సి ఉంటుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విషయంలో ఇదే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో హీరోగా, సహాయ నటుడిగా పలు సినిమాలు చేసినప్పటికీ హిందీ వరకే ఇతడి పేరు తెలుసు. ఎప్పుడైతే 'ధురంధర్'లో విలన్‌గా చేశాడో ఇతడి దశ తిరిగిపోయింది. ఓవర‌నైట్ స్టార్‌డమ్ వచ్చేసింది. ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ఇతడు.. ఇప్పుడు కోట్లాది రూపాయలు విలువ చేసే ఇ‍ల్లు కొన్నాడు. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)

ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మలబార్ హిల్‌లో అక్షయ్ ఖన్నా.. ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశాడు. దీని విలువ రూ.33.26 కోట్లు. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ అంతా పూర్తయింది. మలబార్ హిల్ రోడ్డులోని 30 లిటిల్ గిబ్స్‌లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. మరి ఇన్ని కోట్లు పెట్టి కొన్ని దీనిలో స్పెషల్ ఏంటి అని అంటారా?

దక్షిణ ముంబైలోని అత్యంత ప్రతిష్ఠాత్మక నివాస ప్రాంతాల్లో మలబార్ హిల్ కూడా ఒకటి. సముద్రం కనిపించేలా ఫేసింగ్, చాలామంది సెలబ్రిటీలు, సంపన్నులకు ఇది ఫేవరెట్ రెసిడెన్షియల్ లొకేషన్ ఇది. మెరైన్ డ్రైవ్, నరీమన్ పాయింట్, కొలాబా లాంటి ప్రాంతాలకు ఇది దగ్గరగా ఉంటుంది. అందుకే ఇంత ధర అని తెలుస్తోంది.

అక్షయ్ ఖన్నా విషయానికొస్తే.. దిగ్గజ నటుడు వినోద్ ఖన్నా కొడుకు. దిల్ చాహ్తా హై, హమ్‌రాజ్, హుల్చుల్, గాంధీ, మై ఫాదర్, రేస్, దృశ్యం తదితర సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో అయితే  ఛావా, ధురంధర్ సినిమాలతో వావ్ అనిపించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం పర్యవేక్షణలో తీస్తున్న 'మహాకాళి'లో అసురగురువు శుక్రాచార్యగా కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇకపోతే ఇతడు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'కి పోటీగా కొత్త రియాలిటీ షో.. లాంచింగ్ ప్రోమో)

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు