Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
ప్రముఖ ఆలయంలో ది ప్యారడైజ్ హీరో నాని పూజలు
Published on Tue, 09/29/2026 - 13:20
నాని హీరోగా వచ్చిన ది ప్యారడైజ్ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తొలిరోజే మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం.. కలెక్షన్స్ పరంగా రాణిస్తోంది. ఈ మూవీ రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.165 కోట్ల మార్క్ దాటేసింది.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో ఇటీవలే సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో నాని తెలంగాణలోని ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. తన ప్యారడైజ్ టీమ్‌తో కలిసి ములుగు జిల్లాలోని శ్రీ సమ్మక్క, సారలమ్మ దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవార‍్ల ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
our SHER @NameisNani anna & team visited Sri Sammakka Saralamma Devasthanam in Medaram and sought the blessings of the revered deities. ✨#TheParadise Running Successfully All Over. pic.twitter.com/V948N9rfdd
— THE PARADISE (@TheParadiseOffl) September 29, 20269, 2026
Tags : 1