Breaking News

‘రామాయణ’ ప్రమోషన్స్‌లో మిస్టర్‌ బీస్ట్‌.. ఇదేం ట్విస్ట్‌ బాస్‌..

Published on Sat, 09/26/2026 - 14:44

ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ‘రామాయణ’ ఒకటి. నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నవంబర్‌ 06న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలపైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌కు ప్రపంచ ప్రఖ్యాత యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ పాల్గొన్నారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇండియాలో మిస్టర్ బీస్ట్..
మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డొనాల్డ్‌సన్. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారు. ఇటీవల భార్య థియా బోయ్‌సెన్‌తో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. అక్కడ ఆయనను చూసిన అభిమానులు ఫొటోల కోసం ఎగబడ్డారు. ఓ చిన్నారి తన చేతితో తయారు చేసిన స్కెచ్‌బుక్‌ను మిస్టర్ బీస్ట్‌కు అందించడం కూడా వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్‌’మూవీపై వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

రామాయణ టీమ్‌తో భేటీ?
మిస్టర్ బీస్ట్ ఇండియా పర్యటన రామాయణ ప్రమోషన్స్‌ కోసమే వచ్చారన్న టాక్‌ నిజమైంది.  ఈరోజు(సెప్టెంబర్ 26)రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి మిస్టర్ బీస్ట్ ముంబైలో ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.  లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్న రవీ దూబే కూడా ఈ ఇంటరాక్షన్‌లో ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా..
‘రామాయణ’ కేవలం భారతీయ ప్రేక్షకులకే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారీ డిజిటల్ ఫాలోయింగ్ ఉన్న మిస్టర్ బీస్ట్‌తో కలయిక సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత రీచ్ తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది. 

నవంబర్‌లో ‘రామాయణ’..
నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ రెండు భాగాల చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, రవీ దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

 #MrBeast, alongside #NamitMalhotra, #SaiPallavi and #RanbirKapoor at a #Ramayana event in Mumbai. pic.twitter.com/o9R9I7oEll

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)