2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం
Breaking News
అమ్మ కూలి, నాలీ చేస్తే.. కొడుకు ఐఎఫ్‌ఎస్ అధికారయ్యాడు!
Published on Wed, 09/23/2026 - 19:38
ఆమె చదువుకోలేదు. కానీ చదువు విలువ తెలుసు. అందుకే అష్టకష్టాలకోర్చి మరీ పిల్లల్ని చదివించింది. ఆర్థిక కష్టాలు, ఆకలి, నిద్రలేని రాత్రులు, ప్రమాదాలు అనారోగ్యం, ఇలా విధి ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ తల్లి ఎక్కడా తలొగ్గలేదు. పిల్లల చదువును కొనసాగించేందుకు ఆమె పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే తన ఉన్నతికి పాటుపడిన ఆ తల్లి త్యాగాలను ఆ కొడుకు స్మరించుకున్నారు. తన తల్లి ఏళ్ల తరబడి చేసిన త్యాగాలకు దక్కిన తొలి ప్రతిఫలం ఈ కుర్చీ అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
కూలీగా, చెత్త ఏరుకునే మనిషిగా పనిచేస్తూ తన కుమారుడిని ఐఐటీ (IIT) చదివించి, ఐఎఫ్‌ఎస్ (IFS) అధికారినే చేసిన ఒక తల్లి విజయగాథ నెట్టింట వైరల్‌గా మారింది. మహారాష్ట్రకు చెందిన సాఖుబాయి పదిభార్ చదువుకోకపోయినా చదువు అంటే ప్రాణం. కుటుంబ పోషణ కోసం గ్రామంలో రోజువారీ కూలీగా, ఆ తర్వాత ముంబైలోని మురికివాడల్లో చెత్త ఏరుకునే వ్యక్తిగా (Ragpicker) పనిచేశారు.ఇన్నీ కష్టాల మధ్య కొడుకును ఉన్నత చదువు చదించారు. ఆమె చేసిన త్యాగాలు,ఆమె కుమారుడు ఐఐటి మద్రాస్‌లో చదువుకుని, ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చేరిన ఆమె కుమారుడు గౌతమ్ పడిభర్ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించాయి.
ఇదీ చదవండి: పక్కింటి వైఫై సాయం : స్లమ్ నుంచి ఢిల్లీ ఐఐటీ దాకా ఎవరీ అభిషేక్
సాఖుబాయి కుమారుడు గౌతమ్ పదిభార్ మహారాష్ట్రలోని జల్నాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నారు. ఎలాంటి అధికారిక కోచింగ్ లేకుండానే జేఈఈ (JEE) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ తర్వాత యూపీఎస్సీ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) పరీక్ష-2022లో ఆల్ ఇండియా ర్యాంక్ 139 సాధించారు. 2023 ఛత్తీస్‌గఢ్ కేడర్ ఐఎఫ్‌ఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇదీ చదవండి: 23 ఏళ్ల తరువాత అమెరికా డ్రీమ్స్ వదిలి ‘అమ్మ’దగ్గరికి
భావోద్వేగ క్షణం
గౌతమ్ ఇటీవల తన తల్లికి సంబంధించిన ఒక భావోద్వేగ క్షణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇటీవల తన తల్లి సాఖుబాయిని తన ఆఫీస్‌కు ఆహ్వానించిన గౌతమ్, ఆమెను తన అధికారిక కుర్చీలో కూర్చోబెట్టారు. "నా జీవితంలో నేను సాధించిన ప్రతిదానికీ నా అమ్మే కారణం. పోరాట పటిష్టతను, కష్టపడే తత్త్వాన్ని, పెద్ద కలలు కనే స్వేచ్ఛను నాకిచ్చింది అమ్మే" అంటూ ఆమె ప్రయాణాన్ని గుర్తు చేసుకొని గౌతమ్ ఎమోషనల్ అయ్యారు.
ఇదీ చదవండి: లండన్ - ఢిల్లీ ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
Tags : 1