Audio Viral: టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు
Breaking News
తెలుగులో ఫ్లాఫ్.. అక్కడ మాత్రం హిట్.. అందుకేనా?
Published on Thu, 09/17/2026 - 17:46
సినీ ప్రేక్షకుల గుండెల్లో సూపర్ హిట్‌గా నిలిచిపోయిన సిరీస్ మీర్జాపూర్. ఈ సిరీస్ మూడు సీజన్లు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. బాలీవుడ్లో తెరకెక్కించినప్పటికీ ఇతర భాషల్లో సత్తా చాటింది. దీంతో ఈ వెబ్ సిరీస్‌లను మూవీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మీర్జాపూర్ ది మూవీ పేరుతో రిలీజ్ చేశారు.
అయితే వెబ్ సిరీస్‌కు లభించినంత ఆదరణ ఈ సినిమాకు లభిస్తుందని మేకర్స్ భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పంకజ్ త్రిపాఠి, దివ్యెందు శర్మ, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. తెలుగులో అయితే ఈ సినిమాకు ఆదరణ కరువైంది. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడంతో తెలుగులో కొద్దిపాటి వసూళ్లకే పరిమితమైంది.
హిందీలో మాత్రం..
దక్షిణాది భాషల్లో లభించని ఆదరణ బాలీవుడ్లో మాత్రం దక్కుతోంది. హిందీ మార్కెట్లో ఈ మూవీకి రూ.150 కోట్లకి పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. హనుమాన్ అంశ్ లాంటి మూవీ పోటీ ఉన్నప్పటికీ మీర్జాపూర్ మాత్రం కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. హిందీలో వసూళ్లు ఫర్వాలేదనిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే రూ.200 కోట్ల వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఫీట్ అందుకుంటుందేమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Tags : 1