బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?
Breaking News
మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను
Published on Wed, 09/09/2026 - 15:26
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘పంచనామా’ సిద్ధమైంది. మోహన్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది.ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత, నటి ఉదయభాను చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఎక్కువ మంది చదివింది: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ ?
స్వయం కృషితో ఎదిగా..
చిన్న వయసు నుంచే మైక్ పట్టుకుని స్వయం కృషితో ఎదిగానని ఆమె తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఒంటరిగానే నిలబడ్డానని చెప్పారు. ‘ఎవరికి టాలెంట్ ఉన్నా.. ఏ డోర్ మూసుకుపోయినా.. ఉదయభాను ప్రొడక్షన్స్ ఉందని మర్చిపోవద్దు. ఎవరి దగ్గర సత్తా ఉన్నా.. ఈ ప్రొడక్షన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని ఉదయభాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉంటుందంటే?x.com/FilmyFocus/status/2097604851358457984?s=20
Tags : 1