Breaking News

ఓటీటీలో 'లస్ట్ స్టోరీస్ 3' స్ట్రీమింగ్‌.. అధికారిక ప్రకటన

Published on Sun, 09/06/2026 - 09:15

ఓటీటీల్లో చాలామంది సినిమాలు చూస్తుంటారు. అదే టైంలో కొన్ని సిరీస్‌లు కూడా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఆశ్చర్యపరుస్తాయి. అలా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రిలీజై సెన్సేషన్ సృష్టించిన సిరీస్ 'లస్ట్ స్టోరీస్'. తర్వాత కాలంలో దీనికి రెండో పార్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో సీజన్ కూడా సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి ఓ వీడియోని విడుదల చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

నెట్‌ఫ్లిక్స్‌ పాపులర్‌ ఆంథాలజీ ఫ్రాంచైజీ 'లస్ట్ స్టోరీస్' మూడో భాగాన్ని ఈనె 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.  ఈ సీజన్‌లో ఉండే నాలుగు కథలకు విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ప్రేమ, ఆకర్షణ, సంబంధాలు, అణచివేసిన కోరికలు అనే అంశాల ఆధారంగా వీటిని తెరకెక్కించారు. ఈ సీజన్‌లో రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావు హైదరీ, రాధికా మదన్, సనా థంపి, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, సిద్ధార్థ్, అలీ ఫజల్, గుర్ఫతేహ్ పిర్జాదా తదితరులు ప్రధాన పాత్రలు చేశారు.

‘లస్ట్ స్టోరీస్’ ఫ్రాంచైజీ 2018లో ప్రారంభమైంది. తొలి భాగంలోని స్టోరీలకు అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఈ ఆంథాలజీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్ అయింది. 2023లో ‘లస్ట్ స్టోరీస్ 2’ విడుదలైంది. ఇప్పుడు మూడో సీజన్ రానుంది.మరి ఇదెలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)