Breaking News

అమ్మా, నాన్న క్షేమమే కదా..! నీట్‌ పీజీ విద్యార్థి భావోద్వేగం

Published on Wed, 09/02/2026 - 17:22

నేపాల్‌లో సంభవించిన జలప్రళయం వేలాది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందులో గల్లంతైన వారి ఆచూకి కోసం కొండంత ఆశతో చూస్తూన్న ఘోష మాటలకందనిది. ఈ నేపథ్యంలో ఓ కంటెంట్‌ క్రియేటర్‌ నీట్‌ పీజీ వైద్య విద్యార్థి తన్వి షేర్‌ సోషల్‌ మీడియా వేదకగా షేర్‌ చేసిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆమె పేరెంట్స్‌ కూడా నేపాల్‌ వరదల్లో గల్లంతయ్యారు. ఇంతవరకు వారి ఆచూకీ కానరాలేదు. అయినా సరే తన అమ్మనాన్న ఎక్కడోఒక చోట క్షేమంగా ఉంటారని కొండంత ఆశతో చూస్తున్నా అటూ కన్నీటి పర్యంతమైందామె వీడియోలో. 

తన్వి తల్లిదండ్రలు 67 మంది సభ్యుల బృందంతో కలిసి కైలాస యాత్రకు వెళ్లినట్లు పేర్కొంది. ఆ బృందం చివగా ఇమ్మిగ్రేషన్‌ సెంటర్‌ ఫ్రెండ్‌షిప్‌బ్రిడ్జ్‌ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ రెండు ప్రదేశాలు ఇప్పడు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ తన తల్లిదండ్రులు అక్కడున్న ఏదో ఒక పునరాసవ కేంద్రానికి చేరుకుని సురక్షితంగా ఉంటారేమోనని ఆశిస్తోందామె. ఆ బృందంలోని ఎవ్వర్నీ సంప్రదించలేకపోవడంతో ఆమె తల్లిదండ్రలు ఆచూకీ మరింత క్లిష్టంగా మారింది. 

ఆ విషయాన్నే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీడియోలో వివరిస్తూ..కన్నీళ్లు పెట్టుకుంది. తాను భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల శాక, నేపాల్‌, చైనా అధికారులను సైతం సంప్రదించామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంది.  తాను నీట్‌ పీజీ పరీక్ష రాస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నానని, కన్నీళ్లు వచ్చేయడంతో కొన్ని ప్రశ్నలు చదవలేకపోయానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. 

తన తండ్రి ఈ పరీక్ష రాయాలని కోరుకున్నారు, అందువల్ల కచ్చితంగా ఈ పరీక్ష రాసి తీరాల్సి వచ్చింది. అంతకంటే బాధకరం ఏంటంటే..పరీక్షకు వెళ్లేమందు అమ్మ పెరుగు చక్కెర కలిపి తినిపించి ఆల్‌ది బెస్ట్‌ చెప్పి దీవించేవారు. అది మరింత గుర్తు వచ్చి కన్నీళ్లు ఆగలేదు అంటూ ఆవేదనగా చెప్పింది. ఎలాగైన వాళ్లు తిరిగి రావాలి, కచ్చితంగా తిరిగి రావాలంటే ఉబికివస్తున్న కన్నీళ్లతో చెబుతూ తన సంభాషణను ముగించింది. 

కాగా, నేపాల్‌ విపత్తులో మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 939కి చేరగా, గల్లంతైన వారి సంఖ్య నాలుగువేలకు చేరుకుందని అధికారులు తెలిపారు. సుమారు 158 మంది భారతీయులను రక్షించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. 

 

(చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! తల్లిదండ్రుల ఆచూకీ కోసం..ఆ పసివాడు..)
 

#

Tags : 1

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)