snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే..
Breaking News
కొత్త సీన్లతో ‘అర్జున్ రెడ్డి’ మళ్లీ రిలీజ్ చేస్తాం: ప్రణయ్ రెడ్డి
Published on Wed, 09/02/2026 - 12:38
‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు? అతని జీవితంలో ఏం జరిగింది? అతని ప్రేమకథ ఎలా సాగింది? వాళ్ల ఫ్రెండ్స్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి? అనేది ‘రోమాంచకం’ సినిమాలో మంచి వినోదాత్మకంగా సాగుతుంది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. 2 గంటల 20 నిమిషాల టైమ్‌లో ఎక్కడా బోర్ కొట్టదు’’ అని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు.
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగా విలేకరులతో చెప్పిన విశేషాలు.
(చదవండి: మూడు వారాల్లోపే ఓటీటీలో కొత్త మూవీ స్ట్రీమింగ్)
→ సినిమా నిర్మాణం సీరియస్‌గా చేయాలని టీమ్స్‌ను పెట్టుకుని చేసే మైండ్ సెట్లో మేం లేం. డైరెక్టర్ వేణుగోపాల్ మూడు నాలుగేళ్లుగా మాతో జర్నీ చేస్తున్నారు. ఆయన స్క్రిప్ట్ నెరేషన్ మమ్మల్ని ఆకట్టుకోవడంతో ‘రోమాంచకం’ తీశాం.
→ ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాక సందీప్ రెడ్డి జోక్యం చేసుకోలేదు. ఆయన ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. మా మూవీ ఔట్పుట్ చూసి హ్యాపీగా ఫీలయ్యారు. సుమంత్, అనంతిక బాగా నటించారు. వాసుకి వైభవ్ అద్భుతమైన సంగీతం అందించారు. యూత్, ఫ్యామిలీ అందరూ కలిసి ఇబ్బంది లేకుండా మా మూవీ చూడొచ్చు.
→ అమెరికాలో సెన్సార్ అనేది ఇండస్ట్రీ వాళ్ల సారథ్యంలో నడుస్తుంది. ఇక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రభుత్వ కోణంలో సెన్సార్ నిబంధనలు సరైనవే. ఆ రూల్స్ తెలిసుంటే ఫిల్మ్ మేకర్స్ ముందే జాగ్రత్తపడతారు.
→ ‘అర్జున్ రెడ్డి’ని మళ్లీ రిలీజ్ చేస్తాం... ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి కొన్ని సన్నివేశాలు యాడ్ చేసి, వచ్చే ఏడాది రీ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రభాస్‌గారితో మేం చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తయింది. ‘స్పిరిట్’ మూవీ పూర్తయ్యాక సందీప్, నేను కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాం. మంచి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా చిన్న చిత్రాలు నిర్మిస్తాం.
Tags : 1