Breaking News

తమిళ హీరో కాళ్లు మొక్కిన తెలుగు హీరో సుహాస్

Published on Sat, 08/29/2026 - 16:39

తెలుగు హీరో సుహాస్ ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించాడు. గత రెండేళ్లలో దాదాపు 10కి పైగా సినిమాల్లో కనిపించిన ఇతడు.. ఈ ఏడాది మాత్రం 'హే బల్వంత్' అని ఒకే మూవీతో వచ్చాడు. కామెడీగా ఉన్న ఈ చిత్రం పర్లేదనిపించింది. ఇక ఇదే ఏడాది తమిళంలోకి 'మండాడి'తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సెప్టెంబరు 10న ఇది తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో శుక్రవారం జరగ్గా.. ఇందులో సుహాస్.. హీరో సూరి కాళ్లు మొక్కాడు.

(ఇదీ చదవండి: ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. లిరికల్ వీడియో రిలీజ్)

'మండాడి' సినిమా విషయంలో తనకు అన్ని విధాల సూరి అన్న అండగా నిలిచాడని చెబుతూ సుహాస్ భావోద్వేగానికి గురయ్యాడు. స్టేజీపైనే అందరి ముందు కాళ్లు మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీని భిన్నమైన స్క్రీన్ ప్లేతో పూర్తిగా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీగా తెరకెక్కించారు. తమిళం వరకు సూరి హీరో, సుహాస్ విలన్‌గా కనిపించనుండగా.. తెలుగులోకి వచ్చేసరికి సుహాస్ హీరోగా, సూరి విలన్‌గా కనిపించనున్నారట. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మతిమారన్ పుళగెంది దర్శకుడిగా వ్యవహరించాడు.

(ఇదీ చదవండి: అమ్మ జ్ఞాపకార్థం.. కొత్తింట్లోకి తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా)

Videos

బిర్యానీ సెంటర్లో పెరుగు కోసం కొట్లాట

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

Photos

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)