డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?
Breaking News
నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Published on Mon, 07/27/2026 - 11:51
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే చాలావరకు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ కొన్ని మాత్రం నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్‌గా చేసిన చిత్రమిది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?
(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ)
తమిళ నటుడు ఎలన్.. హీరోగా పరిచయమవుతూ దర్శకుడిగా మారి తీసిన సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం', తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్. గతేడాది ఈ మూవీ గురించి న్యూస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని వచ్చే నెల 21న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.
'ప్యార్ ప్రేమ కళ్యాణం' విషయానికొస్తే.. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉండాలని ఓ అమ్మాయి(శాన్వి మేఘన) నిర్ణయించుకుంటుంది. దీంతో ఆమె భర్త (ఎలన్) ఇల్లరికం రావాల్సి వస్తుంది. ఈ కారణంగా ఇరు కుటుంబాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు తమ జీవితాన్ని తాము ఎలా మలుచుకోవాలనే విషయాన్ని ఈ జంట ఎలా తెలుసుకుంటుంది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.
ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్, గీతా కైలాసం తదితరులు కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
Indha maari oru save the date ah neenga paathrukave maateenga 🤭🤣 pic.twitter.com/XLS3oR38Nd
— Netflix India South (@Netflix_INSouth) July 27, 2026
Tags : 1