రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!
Breaking News
రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పనిచేయను
Published on Tue, 07/21/2026 - 11:45
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేతిలో ఫోన్, అందులో సోషల్ మీడియా అకౌంట్స్ ఆన్‌లో ఉండాల్సిందే. సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేదు. అంతా ఇదే చేస్తున్నారు. చాలా తక్కువమంది నటీనటులు మాత్రమే దీనికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్లలో మలయాళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఒకరు. రూ.100 కోట్లు ఇచ్చినా గానీ సోషల్ మీడియాలోకి రానని పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకు గల కారణాన్ని వెల్లడించింది.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన 'బిగ్‌బాస్' శుభశ్రీ)
'నావి మార్ఫింగ్, డీగ్రేడింగ్ చేసిన ఫొటోలు చూసి షాకయ్యాను. దాని నుంచి తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది. రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా నేను సోషల్ మీడియాకు దూరంగానే ఉంటాను. నా సినిమాల గురించి వచ్చే వార్తలు, ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి మాత్రం నా పెంపుడు కుక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఉపయోగిస్తాను. ప్రస్తుతం నేను కొత్త వ్యక్తులని కలవడంలో నిజమైన ఆనందాన్ని పొందుతున్నాను' అని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది.
ఈమె నటించిన తమిళ మూవీ 'గట్ట కుస్తీ 2' రెండు వారాల క్రితం థియేటర్లలోకి వచ్చింది. స్పోర్ట్స్ కామెడీ జానర్‌లో తెరెకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో గాడ్సే, అమ్ము తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు'లో నటిస్తోంది. మరోవైపు పీరియడ్ తమిళ మూవీతో పాటు '#లవ్', 'తీవినై పోట్రు' అనే వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)
#AishwaryaLekshmi: "Even if I'm offered ₹100 crore, I will never return to social media."
She revealed that morphed and degrading photos deeply affected her, adding that leaving social media finally gave her peace of mind. pic.twitter.com/tQn2LHhAfT— Filmyscoops (@Filmyscoopss) July 21, 2026
Tags : 1