గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్
Breaking News
అవి మాత్రమే పోస్ట్ చేస్తా.. 'సబ్స్క్రిప్షన్'పై తెలుగు హీరోయిన్
Published on Thu, 07/09/2026 - 10:43
కొన్నిరోజుల క్రితం ఇన్‌స్టా 'సబ్స్క్రిప్షన్' వల్ల యాంకర్ విష్ణుప్రియ ఎంతలా విమర్శలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబ్బులు తీసుకుని అర్థనగ్న ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేస్తుందని చెప్పి ఈమెపై పోలీసులకు కొందరు ఫిర్యాదు కూడా చేశారు. హీరోయిన్ అనన్య నాగళ్ల లాంటి వాళ్లు తన సబ్స్క్రిప్షన్ అకౌంట్లో ఎలాంటి కంటెంట్ పెడతారనేది క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా ఈ విషయమై స్పష్టత ఇచ్చేసింది.
(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి)
తన సబ్స్క్రిప్షన్ ఛానెల్‌పై వస్తున్న అపోహలపై క్లారిటీ ఇచ్చిన పాయల్.. ఎలాంటి రొమాంటిక్ కంటెంట్ లేదా హాట్ పిక్స్ ఉండవని స్పష్టం చేసింది. తెర వెనుక తన నిజమైన జీవితం, అన్ఫిల్టర్డ్ మూమెంట్స్‌ని మాత్రమే అభిమానులతో పంచుకుంటానని చెప్పింది. తన వ్యక్తిగత హద్దులను గౌరవిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది.
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్.. తర్వాత వెంకీమామ, ఆర్డీఎక్స్ లవ్, డిస్కో రాజా, జిన్నా, మాయపేటిక, మంగళవారం తదితర మూవీస్ చేసింది. ప్రస్తుతం 'కిరాతక' అనే చిత్రంలో నటిస్తోంది.
(ఇదీ చదవండి: ఈ సినిమాకు A సర్టిఫికెట్ కూడా తక్కువే!)
Tags : 1