Breaking News

మా దుస్తులపై కూడా వాళ్లదే నిర్ణయం..: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Published on Mon, 07/06/2026 - 17:28

ఆదిపురుష్ భామ కృతి సనన్ ఈ ఏడాది ప్రారంభంలో కాక్‌టెయిల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో షాహిద్ కపూర్ సరసన మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృతి సనన్.. సినీ ఇండస్ట్రీలో పురుషాధిక్యతపై మాట్లాడింది. ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేసింది.

సినీ పరిశ్రమలో లింగ వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతుందని కృతి సనన్ అన్నారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉంటే స్టార్‌డమ్‌ చాలా ప్రత్యేకమన్నారు. హీరోయిన్ల విషయానికి వస్తే ఎలాంటి గుర్తింపు ఉండదని తెలిపారు. సెట్‌లో పురుషులకు అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. తెరపై రాసే పాత్రల విషయంతో పాటు సెట్‌లో పురుష, మహిళా నటీనటులను వేర్వేరుగా చూసే విధానంలో కూడా సినీ పరిశ్రమ పురుషులకే అనుకూలంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటివీ ఎక్కువగా చూశానని తెలిపారు. ఒక మహిళా నటి ఎక్కువ ప్రశ్నలు అడిగినప్పుడు సెట్‌లో వ్యతిరేకత పెరిగిపోతుందని కృతి సనన్ పంచుకుంది. 

కృతి సనన్ మాట్లాడుతూ..' సెట్‌లో  దర్శకుడిని ప్రశ్నలు అడగడం నాకు అలవాటు. నాకు ఆసక్తి ఎక్కువ. ఎప్పటినుంచో అంతే. అలానే నేను ఎదిగాను. నేను నటనలో ఎప్పుడూ శిక్షణ తీసుకోలేదు. ఏమీ తెలియనట్టు ఉండటం కన్నా ప్రశ్నలు అడగడమే మేలు అనుకుంటా.  నేను ఏదైనా సలహా ఇస్తే.. నువ్వు దీన్ని అనవసరంగా విశ్లేషిస్తున్నావ్ అంటారు. సెట్స్‌పై ఉండే మేనేజ్‌మెంట్‌కు హీరోల టైమింగ్స్ అంటే ఒక రకమైన భయం, గౌరవం. అందుకే వాళ్లను షాట్ పెట్టాక పిలుస్తారు. కానీ హీరోయిన్లను మాత్రం ముందే పిలిచి సెట్స్‌లో కూర్చోబెడతారని' ఆమె తెలిపింది.

కృతి సనన్ ఇంకా మాట్లాడుతూ.. 'చాలాసార్లు హీరోయిన్లకు దక్కాల్సిన ఆత్మగౌరవం, సమానత్వం దక్కదు. చెప్పింది చెయ్ అంటూ అవమానిస్తారు. ఇక హీరోయిన్లు ఏ ఏ ప్రమోషన్లలో పాల్గొనాలి.. ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారు. చివరకు మేం వేసుకునే దుస్తులు కూడా వాళ్లే చెబుతారు. అందుకే హీరోయిన్లకు ప్రాధాన్యత లేని పాత్రలు చేయడానికి తాను ఇష్టపడట్లేదని' చెప్పుకొచ్చింది. 

Videos

రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు

అసలు టార్గెట్ రావణేనా..? రావణ్‌పై ఎవరి గేమ్..?

ఒక్కటే అడుగుతున్న.. నీ తల్లి దండ్రులతో ఉన్న ఒకేఒక్క ఫోటో చూపించు..

అంతా నా ఇష్టం

నిజామాబాద్ లో దారుణం.. భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి

ఎవరో సైకోలు , పిచ్చోళ్లో తెలియదా..? జగన్ పై మాటలు జాగ్రత్త..!

ఎవడడిగాడు నిన్ను ఫ్రీ బస్సు... దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా

చంద్రబాబుకు నేను చెప్పేది ఇదే చాలా ప్రమాదకరం...

రౌడీలను పెంచి పోషించేది కూటమి.. వాటాల రాజ్యం పోతేనే..

లై డిటెక్టర్ టెస్ట్ లో సియా ఏం చెప్పిందంటే..? అందరూ షాక్!

Photos

+5

సంయుక్త నీ అందం వేరే! (ఫొటోలు)

+5

తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు)

+5

మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు)

+5

ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

30ల్లో ఫ్రెండ్‌షిప్ ఇలా.. ఈ హీరోయిన్ గుర్తుందా? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 05 - 12)