TOXIC రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక మాస్ జాతరే
Breaking News
సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష
Published on Tue, 06/23/2026 - 10:32
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి కావడం మాటేమో గానీ ఆ టైంలో హీరోయిన్ త్రిష తెగ వైరల్ అయిపోయింది. వీళ్లిద్దరూ డేటింగ్ ఉన్నారన రూమర్సే దీనికి కారణం. ఇదే కాదు విజయ్ వదిలేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఉపఎన్నిక కోసం త్రిషనే పోటీలో నిలబెడతారనే రూమర్స్ కూడా వచ్చాయి. అలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచిన ఈ జంట.. ఊహించని విధంగా ఇప్పుడు చర్చకు కారణమయ్యారు.
(ఇదీ చదవండి: సమంత-నయనతార.. ఇంట్రెస్టింగ్ బాండింగ్)
సోమవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అభిమానులు మాత్రం త్రిష నుంచి స్పెషల్ విషెస్ వస్తుందని ఎదురుచూశారు. రోజు గడిచిపోయింది కానీ ఎలాంటి శుభాకాంక్షల పోస్ట్ కనిపించలేదు. పైపెచ్చు విజయ్‌ని త్రిష.. ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది.

ఇన్నాళ్ల పాటు సాగిన బంధానికి పుల్‌స్టాప్ పడిపోయిందా? మరి త్రిష ఎందుకిలా చేసింది అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై త్రిష స్పందించి క్లారిటీ ఇస్తే తప్పితే ఈ చర్చ ఆగదు. ప్రస్తుతం త్రిష తెలుగులో 'విశ్వంభర' చేసింది. ఈ మధ్యే సూర్య 'వీరభద్రుడు' మూవీతో హిట్ అందుకుంది. కెరీర్ పరంగా అయితే పీక్ స్టేజీలో ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్)
Tags : 1