విజయ్ Vs ఉదయ్ తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
Breaking News
రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీ డేట్ వైరల్..!
Published on Mon, 06/22/2026 - 21:41
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీ దాదాపు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించగా.. కోలీవుడ్ భామ శృతి హాసన్ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది.
ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన టాక్ వినిపిస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. జూలై 2 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
కాగా.. ఈ చిత్రంలో జగపతి బాబు, బొమన్ ఇరానీ, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా తన సేవలందించారు.
Tags : 1