Perni Nani: తొక్కి పెట్టి నార తీస్తావా? ఆటలో అరటిపండు గాడివి..!
Breaking News
'చిన్నప్పుడు ఎన్నో కష్టాలు.. నా బిడ్డకు అలా జరగకూడదు': సమంత
Published on Mon, 06/22/2026 - 20:49
టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. జూన్ 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.43 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. సామ్ తన సొంత బ్యానర్‌లోనే నిర్మించింది. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఇదిలా ఉంటే సామ్‌పై కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె ప్రెగ్నెన్సీతో ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
గత ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. 'నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను, ఇంటి బాధ్యతలను చూసుకునే మహిళంటే నాకెంతో గౌరవం. నా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా. అలాంటి బాల్యం గడిపిన వారంతా వారి పిల్లలకు లగ్జరీ జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు నేను కూడా అదే నిర్ణయించుకున్నా. నా బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. తనే నా సర్వస్వంగా చూసుకుంటా' అని అన్నారు.
కాగా.. సామ్ ఇటీవల మూవీ ప్రమోషన్స్‌లో శారీలో కనిపించారు. బేబీ బంప్‌తో ఉండడం వల్లే ఆమె అలా ఈవెంట్స్‌కు హాజరయ్యారని నెటిజన్స్ భావిస్తున్నారు. సమంత- రాజ్ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Tags : 1