Breaking News

ముఖ్యమంత్రిగా విజయ్.. ముందే ఊహించిన సమంత

Published on Wed, 06/17/2026 - 19:16

స్టార్ హీరోయిన్ సమంత చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం బుధవారం చెన్నై వెళ్లిన సమంత.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ని కూడా కలిసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: హీరోయిన్-సీఎం విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)

'చెన్నై చేరుకోగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యమంత్రి విజయ్‌ని కలిసే అవకాశం రావడం మరింత ప్రత్యేకంగా అనిపించింది. ఈయన హీరోగా మాత్రమే పరిమితం కావాల్సిన వ్యక్తి కాదు, ఈయన వ్యక్తిత్వం, ప్రజలతో ఏర్పడిన అనుబంధం చూసిన తర్వాత విజయ్ మరింత పెద్ద బాధ్యతలు అందుకుంటారని అనిపించేది. కెరీర్ పరంగా పీక్‌లో ఉన్నప్పుడు నటన వదిలేసి మరిన్ని సవాళ్లు, బాధ్యతలున్న కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ధైర్యంతో కూడిన పని'

'సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, విజయ్ నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తోంది. జీవితంలో ఒక దశలో ప్రతి ఒక్కరికీ తమకోసం మాత్రమే కాకుండా సమాజం కోసం కూడా ఏదైనా చేయాలనే పిలుపు వస్తుంది. ఆ పిలుపునకు స్పందించే వారు చాలా అరుదు.విజయ్ ఇప్పటికే ఆయనను విశ్వసిస్తున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తున్నారనే నమ్మకం ఉంది. ఆయన విజయం కేవలం పదవి వల్ల కాకుండా ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత, స్పష్టమైన ఉద్దేశ్యంతోనే సాధ్యమవుతుంది' అని సమంత రాసుకొచ్చింది.

యువతకు విజయ్ గెలుపు ఒక ప్రేరణగా నిలవాలని, జీవితంలో ప్రారంభంలో కలలు కన్న దానికంటే ఎంతో పెద్ద లక్ష్యాలను సాధించే అవకాశాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయని సమంత చెప్పుకొచ్చింది. సమంత పోస్ట్ బట్టి చూస్తే విజయ్‌తో కలిసి నటిస్తున్న టైంలోనే ముఖ్యమంత్రి లాంటి పెద్ద పొజిషన్‌కి వెళ్తారని ఊహించింది. ఇప్పుడు అది నిజమవడంతో ఆయన్ని కలిసి ఆనందం వ్యక్తం చేసింది. విజయ్-సమంత.. కత్తి, మెర్సల్, తెరి మూవీలో నటించారు.

(ఇదీ చదవండి: ముఖ్యమంత్రి విజయ్ ని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం)

Videos

సాయి కృష్ణను ఎలా ఎప్పుడు చంపారో మొత్తం చెప్పిన జడ శ్రవణ్

రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు

రికార్డెన అసలు నిజం, విచారణలో బయటకు రాబోతున్న సంచలన నిజాలు..!

వనజ చితాభస్మంలో సర్జికల్ సీజర్.. నర్సులే డెలివరీ చేశారా?

గుడివాడకు నోటీస్ ఇచ్చిన హోం మంత్రి, సాయికృష్ణ కేసు మీద డీజీపీ, సీపీకి ఎందుకు ఇవ్వలేదు

సచిన్ దరిదాపుల్లోకి కూడా వైభవ్ రాలేడు ఎందుకంటే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు

హోటల్లో రెండు రోజులు చిత్రహింసలు పెట్టి CIకి అప్పగించారు..! అంబటి షాకింగ్ కామెంట్స్

అనితను ఛీ కొడుతున్న టీడీపీ కీలక నేతలు?

సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు.. అసలు ఏం చేశారు?

నా కొడుకు చనిపోయే ముందు చివరి మాటలు.. క్రాంతి కుమార్ తండ్రి షాకింగ్ కామెంట్స్

Photos

+5

హీరోయిన్ సోనమ్ కపూర్ ఫ్యామిలీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు

+5

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నటి నోరా ఫ‌తేహి సంద‌డి (ఫొటోలు)

+5

రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)

+5

కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో సినీ ప్రేమజంట (ఫొటోలు)