AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!
Breaking News
'పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు
Published on Sun, 06/14/2026 - 15:54
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది కానీ దానికి తగ్గట్లే ఫెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. సినిమాలోని హీరోయిన్ జాన్వీ కపూర్‌ని చూపించిన విధానం దగ్గర నుంచి హీరో పాత్ర పలికే డైలాగ్స్, చేసే పనులపై కూడా విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఐటం సాంగ్ లిరిక్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయనే ట్రోల్స్ కనిపించాయి. ఇప్పుడీ విషయంపై సదరు లిరిక్ అనంత శ్రీరామ్ స్పందించాడు. ఆదివారం 'పెద్ది' సక్సెస్ మీట్‌లో విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!)
'పీహెచ్‌డీలు, పట్టభద్రులు.. వాళ్ల ఆలోచన విధానమే సరైనది అనేది ఎక్కువైపోవడం వల్ల, సోషల్ మీడియాలో కొందరు తన అభిప్రాయాన్ని రుద్దేశారు. అలా ప్రభావితం అవ్వడం తప్ప.. దర్శకుడికి ఓ పాత్ర ఇలా ప్రవర్తిస్తాది అనే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మనం సృజనాత్మకతకు ఏం చేసినట్లు? ముట్టేస్తానని హీరో పాత్రధారి తన ట్రైబ్ భాషలో మట్లాడితేనేమో వల్గారిటీ అంటారు. ఇలా చేస్తే సృజనాత్మకతకని తొక్కినట్లే. ఎవరినీ బాధపెట్టకూడదనే ఉద్దేశంతో బుచ్చిబాబు సారీ చెప్పి ఉండొచ్చు. ఇలా జరుగుతూపోతే రాబోయే రోజుల్లో డాక్యుమెంటరీలో తప్పితే కమర్షియల్ సినిమాల్లో గొప్ప పాయింట్ చెప్పలేం' అని గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చెప్పారు.
అలానే ఐటమ్ సాంగ్‌లోని వారానికి వెయ్యి, నాకోసం దాయి లాంటి లిరిక్స్‌పై వస్తున్న విమర్శలకు బదులిస్తూ.. ఐటమ్ సాంగ్ ఆస్వాదించలేని వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు అని అనంత్ శ్రీరామ్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)
Lyricist Anantha Sriram counters social media warriors & so called progressive audience. pic.twitter.com/3mxy02S6fE
— Aakashavaani (@TheAakashavaani) June 14, 2026
Tags : 1