9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
Breaking News
దళపతికి రామ్ చరణ్ అభినందనలు.. వీడియో వైరల్
Published on Sat, 05/30/2026 - 19:42
తమిళనాడు సీఎం విజయ్‌కు మెగా హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. పెద్ది ప్రమోషన్లతో బిజీగా ఉన్న చెర్రీ ఇవాళ చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళపతి విజయ్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో నిమగ్నమైన విజయ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ రామ్ చరణ్ కొనియాడారు. విజయ్ తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రజా సేవలోకి ప్రవేశించారని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన సీఎం కావడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు సైతం రామ్ చరణ్ అభినందనలు తెలిపారు.
రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిందించారు.
Tags : 1