Breaking News

జూన్‌ బాక్సాఫీస్‌: పెద్దితో పాటు ఆ సినిమాలదే హవా!

Published on Sat, 05/30/2026 - 10:34

ఈసారి బాక్సాఫీస్‌ వద్ద సమ్మర్‌ హవా పెద్దగా కనిపించలేదు. పెద్ద సినిమాలన్నీ అటు షూటింగ్స్‌ పూర్తి కాక, ఇటు ఐపీఎల్‌ రావడంతో వాయిదాలు ప్రకటించాయి. దీంతో వేసవిలో చిన్న, డబ్బింగ్‌ సినిమాల జోరే ఎక్కువగా కనిపించింది. అయినప్పటికీ టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ఎక్కువగా బోసిపోయే కనిపించింది. ఇప్పుడు రామ్‌చరణ్‌ 'పెద్ది'తో మరోసారి బాక్సాఫీస్‌ కళకళలాడేందుకు సిద్ధమైంది. మరి పెద్దితోపాటు జూన్‌లో థియేటర్లలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..

⇒ జూన్‌ 4- పెద్ది
రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా 'పెద్ది'. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయిక. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

⇒ జూన్‌ 5 - హై జవానీ తో ఇష్క్‌ హోనా హై (హిందీ మూవీ)
బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హై జవానీతో ఇష్క్‌ హోనా హై'. మృణాల్‌ ఠాకూర్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. హీరో వరుణ్‌ ధావన్‌ తండ్రి డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 5న రిలీజవుతోంది.

⇒ జూన్‌ 11- సింగ్‌ గీతం
లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్‌ సినిమా 'సింగ్‌ గీతం'. అయాన్‌, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ మూవీ జూన్‌ 11న విడుదలవుతోంది.

⇒ జూన్‌ 19 - మా ఇంటి బంగారం
డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం 'మా ఇంటి బంగారం'. సామ్‌ భర్త రాజ్‌ ఈ చిత్రానికి కథ అందించగా, ఓ బేబీ ఫేమ్‌ నందిని రెడ్డి డైరెక్ట్‌ చేసింది. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. జూన్‌ 19న బంగారం థియేటర్లలోకి వస్తోంది.

⇒ జూన్‌ 19 - ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు
'కోరుకున్న ప్రియుడు', 'పెళ్లి' వంటి సినిమాలతో హీరోగా అప్పట్లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు వడ్డే నవీన్‌. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన 'ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు' మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కమల్‌ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వడ్డే నవీన్‌ హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూన్‌ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

⇒ జూన్‌ 19- దీవానా
శుభం ఫేమ్‌ హర్షిత్‌ రెడ్డి హీరోగా నటించిన చిత్రం 'దీవానా'. స్మేహ మణిమేగలై కథానాయిక. శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'మా ఇంటి బంగారం'తో పోటీపడుతూ జూన్‌ 19న రిలీజవుతోంది.

⇒ జూన్‌ 19 - కాక్‌టైల్‌ 2 (హిందీ మూవీ)
షాహిద్‌ కపూర్‌ హీరోగా, కృతి సనన్‌, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం కాక్‌టైల్‌ 2. ఇది 2012లో వచ్చిన కాక్‌టైల్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. జూన్‌ 19న విడుదలవుతోంది.

⇒ జూన్‌ 26- లెనిన్‌
నాగార్జున చిన్న కుమారుడు, హీరో అఖిల్‌ అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లెనిన్‌. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాతోనైనా అఖిల్‌ హిట్‌ కొడతాడని ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్నట్లు ఈ చిత్రం నెలాఖరులో జూన్‌ 26న రిలీజవుతోంది.

⇒ జూన్‌ 26- వెల్‌కమ్‌ టు ద జంగిల్‌ (హిందీ చిత్రం)
ఇది వెల్‌కమ్‌ సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగం. ఇందులో అక్షయ్‌ కుమార్‌, సంజయ్‌ దత్‌, బాబీ డియోల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇకపోతే జూన్‌ 22న స్టార్‌ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ పుట్టినరోజు ఉంది. ఈ క్రమంలో జూన్‌ 19న ఆయన చివరి మూవీ జన నాయకన్‌ను రిలీజ్‌ చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది. మరి ఈసారైనా సెన్సార్‌ ఆటంకాలు దాటుకుని జన నాయకన్‌ విడుదలవుతుందో, లేదో చూడాలి!

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)