అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
సూపర్ స్టార్ మనవడి శ్రీనివాస మంగాపురం.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
Published on Wed, 05/13/2026 - 14:55
ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ రషా తడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. యే మంగా.. హే మంగా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ఎల్వీ రేవంత్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ మూవీని తిరుపతి పట్టణంలో సాగే ఈ కథ వాసు బాబు, మంగ అనే ఇద్దరు స్నేహితులు... ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణం నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
Tags : 1