అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి
Published on Wed, 05/13/2026 - 13:08
'ధురంధర్' సినిమాలు ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది డిసెంబరులో తొలి పార్ట్ రూ.1300 కోట్లు వసూలు చేయగా.. ఈ మార్చిలో రిలీజైన సీక్వెల్ అంతకు మించిన బీభత్సం చేసింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గరున్న అన్ని రికార్డులు కొల్లగొట్టింది. పుష్ప, బాహుబలి.. దేన్ని వదల్లేదు. చాలామంది ఈ మూవీస్ నచ్చాయి గానీ కొందరు మాత్రం ప్రొపగాండా అని విమర్శించారు. ఇందులో పాకిస్థాన్ కూడా ఉంది.
(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)
గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడే పాక్ నాయకుల్లో అలజడి రేగింది. తన దేశంలోని లయరీ ప్రాంతం గురించి తప్పుతప్పుగా చూపించారని మండిపడ్డారు. అసలు లయరీ ఎలా ఉంటుందో చూపిస్తామని చెబుతూ 'మేరీ లయరీ' అనే సినిమాని కూడా ప్రకటించారు. గత వీకెండ్ అంటే మే 08న థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు కాస్తోకూస్తో బజ్ ఉన్నప్పటికీ థియేటర్లలోకి వచ్చిన ఘోరాతీ ఘోరంగా పరిస్థితి తయారైంది.
ఆజ్ తక్ కథనం ప్రకారం.. 'మేరీ లయరీ' సినిమాకు పాక్‌లోని కొన్ని థియేటర్లలో మరీ 22 టికెట్లే అమ్ముడుపోయాయట. ప్రేక్షకులు కూడా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో తొలిరోజే చాలా థియేటర్లలో నుంచి సినిమాని తీసేశారట. అబూ అలీహా దర్శకత్వం వహించిన 'మేరీ లయరీ' మూవీలో ఆయేషా ఒమర్, దననీర్ మొబీన్, సామియా ముంతాజ్ ప్రధాన పాత్రలు చేశారు.
'ధురంధర్' రెండు భాగాలు కూడా గూఢచర్యం, పాక్ ఉగ్రవాదం నేపథ్యంగా తీశారు. 'మేరీ లయరీ' మాత్రం లయరీ ప్రాంతంలో ఫుట్‌బాల్, సమాజ జీవనం, మహిళల ఆత్మవిశ్వాసం బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. గతంలోనే ఓ సందర్భంలో మాట్లాడిన సింధ్ సమాచార శాఖ మంత్రి షర్జీల్ ఇనామ్.. భారతీయ సినిమాల్లో లయరీ ప్రాంతాన్ని తప్పుగా చూపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్లే మూవీ తీస్తే సొంత ప్రేక్షకుల నుంచే తిరస్కరణ ఎదురైంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)
Tags : 1