Breaking News

హాట్‌టాపిక్‌గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..!

Published on Mon, 05/04/2026 - 15:37

త్రిష  తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 

అదీగాక ఇవాళ త్రిష పుట్టిన రోజు కూడా కావడం ఈ సందర్శన మరింత హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ నటి త్రిష కలియుగ దైవమైన ఆ తిరుపతి వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన విధానం అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. త్రిష అజా ఫ్యాషన్స్‌కు చెందిన వైట్‌సూట్‌తో అలరించింది. దీని ధర రూ. 12000 పైనే పలుకుతుందట. వినెక్‌తో కూడిన ఐవరీ కలర్‌ చేనేత వస్త్రం.  

ముఖ్యంగా ఈ వేసవి వేడికి ఆహ్లాదకరమైన హాయినిచ్చే కాటన్‌ కూడా ఇది. దీనికి తేలికపాటి ఫ్లోరల్ దుపట్టా ఈ డిజైనర్‌వేర్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆలయాన్ని సందర్శించిన అనంతరం, త్రిష కృష్ణన్ చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడు,పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల రోజు త్రిష ఆమె ఆలయ సందర్శన రెండూ ఏకకాలంలో జరగడం కూడా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అదీగాక పోల్ ట్రెండ్స్ ప్రకారం, విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలన విజయాన్ని నమోదు చేయడం విశేషం.

తిరుమల ఆలయం విశిష్టత..
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో ఉన్న వెంకటేశ్వర ఆలయం, వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి.  పైగా శేషాచలం కొండలపై ఉన్న అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. 

కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన ప్రముఖ క్షేత్రం. ఏడు కొండలపైన కొలువైన శ్రీనివాసుడు, కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటూ, ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. ఇక్కడ మూలవిరాట్టు స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం.

 

(చదవండి: 46 దేశాలు పర్యటించా..కానీ భారత్‌ పర్యటన..!)

 

Videos

LIVE : విజయ్ గెలుపు జగన్ రియాక్షన్

LIVE : దూసుకుపోతున్న విజయ్

సీఎం స్టాలిన్ ఓటమి...! విజయ్ దెబ్బ అదుర్స్

తమిళనాడులో విజయ్ తుఫాన్, దళపతికి పట్టం కట్టిన ZenG

నా తమ్ముడు విజయ్... జగన్ ఎమోషనల్ కామెంట్స్

విజయ్ విజయం త్రిష సంచలన కామెంట్స్

DMK ఓటమికి కారణం ఇదే..

విజయంపై విజయ్ తల్లి ఫస్ట్ రియాక్షన్

ఇక్కడ జగన్.. అక్కడ విజయ్, TVK విజయోత్సవంలో YSRCP సంబరాలు

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయంపై NV. సుభాష్

Photos

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)