దూసుకుపోతున్న విజయ్ మ్యాజిక్ ఫిగర్ దగ్గర TVK
Breaking News
తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్‌లో త్రిష
Published on Mon, 05/04/2026 - 11:50
తమిళనాడులో ఊహించని అధికార మార్పు దాదాపు ఖాయంలానే కనిపిస్తుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్‌లోనూ డీఎంకే పార్టీకే మరోసారి అధికారం దక్కొచ్చని చాలామంది అంచనా వేశారు. విజయ్ టీవీకే పార్టీ కొన్ని సీట్లు గెలుచుకోవచ్చని భావించారు. కానీ ప్రస్తుతం ఊహించనవి జరుగుతున్నాయి. టీవీకే పార్టీ ఈ స్టోరీ రాసే సమయానికి 100 సీట్లకు మించి ఆధిక్యంలో కొనసాగుతోంది. కానీ ట్రెండింగ్‌లో మాత్రం త్రిష ఉంది.
(ఇదీ చదవండి: విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)
విజయ్, త్రిష కలిసి పలు సినిమాలు చేశారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ విడాకుల వ్యవహారం బయటకు రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. విజయ్-త్రిష రిలేషన్‌లో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. సరిగ్గా ఆ టైంలో ఓ పెళ్లికి వీళ్లిద్దరూ కలిసి వెళ్లడం హాట్ టాపిక్ అయిపోయింది.
నేడు(మే 04) ఎన్నికల ఫలితాల లెక్కింపు మాత్రమే కాదు. త్రిష పుట్టినరోజు కూడా. ఈ క్రమంలోనే ఆమె తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అయితే విజయ్ కోసమే ఆమె తిరుపతి వెళ్లిందని మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేయించిందని అంటున్నారు. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. త్రిష గురించి చేసి ట్వీట్ వైరల్ అవుతోంది.
'ఆ తిరుమల వేంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది. కంగ్రాట్స్ త్రిష' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. విజయ్‌ని ఉద్దేశించే ఇతడు ఈ ట్వీట్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఏకంగా సీఎం కావాలని ఉందని చెప్పింది. అప్పుడు సరదాగానే అని ఉండొచ్చు. కానీ వినిపిస్తున్న రూమర్స్, విజయ్ అధికారం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుండటంతో త్రిష కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏమైనా ఎంట్రీ ఇస్తుందా అని కూడా మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఇదేం చిత్రం.. ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నాడు!)
Tags : 1