Breaking News

విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?

Published on Mon, 05/04/2026 - 07:34

తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడనే విషయం ప్రస్తుతం ఉ‍త్కంఠగా మారింది. మరోవైపు ఇతడి చివరి సినిమాకు కష్టాలు మాత్రం తప్పట్లేదు. నాలుగు నెలల క్రితమే రిలీజ్ కావాల్సిన మూవీ.. సెన్సార్ సమస్యలతో అలా ఉండిపోయింది. కొన్నిరోజుల క్రితం లీక్ కావడం సంచలనం రేపింది. ఇప్పుడు 'జన నాయగణ్'కి మరో కష్టం వచ్చిపడింది.

(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)

లెక్క ప్రకారం జనవరి 9న విజయ్ 'జన నాయగణ్' సినిమాని థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో రెండు మూడు వారాలు ఆలస్యంగా తీసుకొస్తారులే అని అంతా భావించారు. కానీ నెలలు గడుస్తున్నా రాకపోవడంతో సగటు ప్రేక్షకుడి ఈ మూవీపై ఆసక్తి సన్నగిల్లుతూ వస్తోంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్‌కి కూడా ఆసక్తి పోయినట్లు ఉంది. అందుకే రూ.120 కోట్ల డీల్ నుంచి తప్పుకొన్నట్లు వార్తలొస్తున్నాయి.

అమెజాన్ సంస్థ తప్పుకోవడంతో రేసులోకి వచ్చిన జీ5 సంస్థ.. రూ.50 కోట్ల ఆఫర్ చేసిందట. ఒకవేళ దీనికి టీమ్ ఒప్పుకొంటే రూ.70 కోట్ల నష్టానికి అమ్ముకున్నట్లే అవుతుంది. చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ లీకై, థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని మూవీ విషయంలో అమెజాన్ రిస్క్ చేయలేకపోతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది.

తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రాన్ని రీమేక్ చేసే 'జన నాయగణ్' తీశారు. కాకపోతే విజయ్ రాజకీయ అవసరాలకు తగ్గట్లు పొలిటికల్ డైలాగ్స్, ఎపిసోడ్స్ పెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. కెవిఎన్ నిర్మాణ సంస్థపై వెంకట్ కె నారాయణ నిర్మించారు. ఈ చిత్రం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన.. 'టాక్సిక్' కూడా రిలీజ్ కాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.

(ఇదీ చదవండి: తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా?)

Videos

LIVE : దూసుకుపోతున్న విజయ్

సీఎం స్టాలిన్ ఓటమి...! విజయ్ దెబ్బ అదుర్స్

తమిళనాడులో విజయ్ తుఫాన్, దళపతికి పట్టం కట్టిన ZenG

నా తమ్ముడు విజయ్... జగన్ ఎమోషనల్ కామెంట్స్

విజయ్ విజయం త్రిష సంచలన కామెంట్స్

DMK ఓటమికి కారణం ఇదే..

విజయంపై విజయ్ తల్లి ఫస్ట్ రియాక్షన్

ఇక్కడ జగన్.. అక్కడ విజయ్, TVK విజయోత్సవంలో YSRCP సంబరాలు

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయంపై NV. సుభాష్

విజయ్ గెలుపుపై తండ్రి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)